Viral Video: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..! సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు..

వీడియోలో, సింహం నది ఒడ్డు నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా తాబేలు ఒడ్డుకు వెళ్లడం కూడా మనం చూడొచ్చు.

Viral Video: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..! సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు..
Lionturtle
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2023 | 12:31 PM

సింహాన్ని అడవికి రాజు అంటారు. సోషల్ మీడియాలో సింహాల వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సింహాలు ఇతర జంతువులను వేటాడే అనేక వీడియోలను మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే, సోషల్ మీడియాలో సింహాలు వేటాడే భయానక వీడియోలే కాకుండా సింహానికి సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. సింహాలు కూడా భయపడిపోతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా..? లేదు కదా..? కానీ, ఓ ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వచ్చిన సింహానికి ఏం జరిగిందో సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే అడవి రాజు అన్న మాటలు ఉట్టి మాటలే అని మీకే అనిపిస్తుంది. సింహం ఒక చిన్న ప్రాణి ముందు ఓడిపోయింది. మృగరాజును ఒక చిన్ని తాబేలు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందనే చెప్పాలి. బాగా దాహంతో ఉన్న సింహాన్ని నీళ్లు తాగనివ్వకుండా ఒక బుల్లి తాబేలు భయపెట్టింది..నీళ్ల కోసం నది ఒడ్డుకు చేరిన తాబేలు నిజంగానే సింహానికి నీళ్లు తాగించేలా చేసిందనే చెప్పాలి. సింహం నీళ్లు తాగేందుకు నదిలోకి వంగిన ప్రతిసారి తాబేలు దాన్ని వేధించసాగింది.

నీళ్లు తాగేందుకు వచ్చిన సింహాన్ని తాబేలు వేధిస్తోంది. సింహం నీళ్లు తాగుతుండగా, తాబేలు దాని నోటి కిందకు వస్తూ వేధించసాగింది. కానీ, పాపం సింహం తాబేలుకు హాని కలిగించలేదు. కనీసం దాన్ని బెదిరించి తరిమికొట్టడానికి ప్రయత్నించదు. పైగా, ఇంతటి చిన్న జీవితో నాకేందుకులే అన్నట్టుగా తాబేలు ఉన్న చోటు నుండి సింహం దూరంగా వెళ్లిపోయింది. అలా ఎంత దూరం వెళ్లినా తాబేలు సింహాన్ని అనుసరించింది. వీడియోలో, సింహం నది ఒడ్డు నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా తాబేలు ఒడ్డుకు వెళ్లడం కూడా మనం చూడొచ్చు.

ఇది Instagram ఖాతా latestkurger ద్వారా షేర్‌ చేయగా, వీడియో వైరల్‌గా మారింది. తాబేలు తన చెరువు నుంచి సింహాన్ని తరిమికొట్టిందనే ఫన్నీ క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేయబడింది. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట మళ్లీ హల్చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..