AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అపరిచితుడి ఔదార్యం.. ! వర్షంలో తడుస్తున్న తల్లికొడుకుల కోసం ఏం చేశాడో చూడండి..!

ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన కూడా వస్తోంది. ఈ వీడియో ఇప్పటివరకు దాదాపు మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. సోషల్ మీడియా వినియోగదారులు సాయం చేసిన వ్యక్తిని ప్రశంసలతో ముంచేతుత్తున్నారు.

Watch: అపరిచితుడి ఔదార్యం.. ! వర్షంలో తడుస్తున్న తల్లికొడుకుల కోసం ఏం చేశాడో చూడండి..!
Stranger Offers Umbrella
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2023 | 2:19 PM

Share

మనుషుల్లో ఉండే మంచితనం, ప్రేమ, శ్రద్ధలే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటుంటారు పెద్దలు. ఇలాంటి మాటలు మీరు కూడా తరచూగా వినే ఉంటారు. దయ, జాలి, మానవత్వానికి సబంధించిన అనేక రకాల సంఘటనలు ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో చూస్తుంటాం. కొన్ని వీడియోలు మనల్ని ఎమోషనల్‌గా టచ్ చేసే విధంగా ఉంటాయి. అలాంటివి చాలా వరకు మదిలో మెదులుతూనే ఉంటాయి. మనిషిలోని ప్రతీకగా నిలిచిన సంఘటన ఒకటి జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు షేర్‌ చేశారో స్పష్టంగా తెలియలేదు. దాని ప్రామాణికత కూడా అస్పష్టంగా ఉంది. కానీ వీడియో చూసినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా మన మనసును ప్రభావితం చేసే దృశ్యమని నిస్సందేహంగా చెప్పగలం.

వైరల్‌ వీడియోలో వర్షం పడుతుండగా ఒక తల్లి తన బిడ్డతో వీధిలో నడుస్తూ కనిపించింది. చాలా మంది వారిని దాటుకుంటూ వెళ్తున్నారు. అయితే వానలో తడుస్తూ వెళ్తున్న తల్లిబిడ్డలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఒక అపరిచితుడు మాత్రం వారిని గమనించి దయతో వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తన చేతిలోని గొడుగును ఆ తల్లి బిడ్డలకు అందించాడు. గొడుగు తీసుకున్న ఆ తల్లి కృతజ్ఞతగా అతని ముందు వంగి నమస్కరించింది. దానికి అతడు అయ్యో అదేం వద్దులే మేడమ్‌ అన్నట్టుగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చిన్న క్లిప్‌లో రద్దీగా ఉండే వీధిలో కొంతమంది వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన ఈ వీడియోలో వర్షం కురుస్తుండగా, ఆ తల్లి తన బిడ్డను ఎత్తుకుని హడావిడిగా తీసుకువెళుతుంది. అయితే అది చూసిన ఓ అపరిచితుడు తన గొడుగును ఆ మహిళకు అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వ్యక్తి దయ, ఔదార్యానికి ప్రతీక అని, ఇతడు చాలా మంది ఆదర్శంగా నిలుస్తాడని అంటున్నారు వీడియో చూసిన ప్రతిఒక్కరు. ఆపదలో ఉన్న, కష్టాల్లో ఉన్న మనిషి సాయం చేయాలనే విషయాన్ని మరచిపోకూడదని వీడియో చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను చాలా మంది చూశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన కూడా వస్తోంది. ఈ వీడియో ఇప్పటివరకు దాదాపు మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. సోషల్ మీడియా వినియోగదారులు సాయం చేసిన వ్యక్తిని ప్రశంసలతో ముంచేతుత్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..