Viral News: పేషెంట్‌తో ప్రేమలో పడ్డ డాక్టర్..! ఆమె చనిపోయిన తర్వాత కూడా ఏడేళ్ల పాటు ప్రేమతో..
21 ఏళ్ల మహిళ క్షయ వ్యాధికి చికిత్స కోసం వచ్చినప్పుడు సదరు వైద్యుడు ఆమెను కలిశాడు. చికిత్స అందించే క్రమంలోనే అతడు యువతితో సన్నిహితంగా మెలిగాడు. ఆ తర్వాత వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆ మహిళ మృతి చెందింది.
ప్రేమ ఎప్పుడూ మధురమైన జ్ఞాపకమే. అలాంటి ప్రేమకథలు చాలా విన్నాం, చూశాం కూడా. ఒక విచిత్రమైన ప్రేమకథ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. చనిపోయిన మహిళ మృతదేహాన్ని వెలికితీసిన ఒక వైద్యుడు.. ఏడేళ్లపాటు ఆమెతోనే కలిసి ఉన్నాడు. షాకింగ్ ప్రేమకథ అమెరికాలో చోటు చేసుకుంది. చనిపోయిన యువతి తన ప్రియురాలు కావడం వల్ల అతడు ఇంతకాలం డెడ్ బాడీతో ఉండడానికి కారణమని చెప్పాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కార్ల్ టాంజ్లర్ అనే వైద్యుడు తనకు చికిత్స చేస్తుండగా మరణించిన ఓ మహిళ సమాధిని తెరిచి ఆమెతో ఏడేళ్లు జీవించాడు. మరియా ఎలెబా మిలాగ్రో డి హోయోస్ అనే యువతి మృతదేహంతో కలిసి జీవించాడు.
ఆ యువతి ఆత్మ ఎప్పుడూ తనను చూసేందుకు వస్తుందని, తిరిగి తనకు ప్రాణం పోసుకోవాలనుకునే ఆశతో ఆ యువతి తన కలల్లోకి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అందుకే ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీసి ఆమె వద్దే ఉన్నాడు. ఏడేళ్ల పాటు మృతదేహంపై రకరకాల ప్రయోగాలు చేశాడు. అతను మరియా మృతదేహానికి ముసుగు, ఆమె కళ్లకు కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టాడు.
అసలు విషయం ఏంటంటే.. 21 ఏళ్ల మహిళ క్షయ వ్యాధికి చికిత్స కోసం వచ్చినప్పుడు సదరు వైద్యుడు ఆమెను కలిశాడు. చికిత్స అందించే క్రమంలోనే అతడు యువతితో సన్నిహితంగా మెలిగాడు. ఆ తర్వాత వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని సమాధి చేసిన తర్వాత, టాన్స్లర్ వారికి తెలియకుండా సమాధిని తెరిచి మృతదేహాన్ని దొంగిలించాడు. ఆ తర్వాత ఆ మహిళ మృతదేహంతో ఏడేళ్లు గడిపాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..