Haryana: హర్యాణాలో ఘోర ప్రమాదం. ఒక్కసారిగా కూలిపోయిన రైస్‌మిల్ భవనం

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ అంచనా వేయలేరు. రోడ్డు ప్రమదాలు, అగ్నిప్రమాదాలు, విపత్తులు ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఆయుష్షు నిండకుండానే ప్రాణాలు కోల్పోతారు. తాజాగా అలాంటి ఘటనే హర్యాణాలోని కర్నల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Haryana: హర్యాణాలో ఘోర ప్రమాదం. ఒక్కసారిగా కూలిపోయిన రైస్‌మిల్ భవనం
Building Collapses
Follow us
Aravind B

|

Updated on: Apr 18, 2023 | 10:58 AM

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ అంచనా వేయలేరు. రోడ్డు ప్రమదాలు, అగ్నిప్రమాదాలు, విపత్తులు ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఆయుష్షు నిండకుండానే ప్రాణాలు కోల్పోతారు. తాజాగా అలాంటి ఘటనే హర్యాణాలోని కర్నల్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం రోజున మూడు అంతస్థులు రైస్ మిల్ భవనం కూలిపోవడంతో నలుగురు వర్కర్లు అక్కడిక్కడే చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

ఆ రైస్‎మిల్ లో పనిచేసే వందలాది కార్మికులు ఆ భవనంలోనే నిద్రపోయేవారు. అయితే మంగళవారం రోజున 150 మంది కార్మికులు ఆ భవనంలో ఉండగా అది ఒక్కసారిగా కుప్పకూలడం కలకలం రేపింది. ఆ భవనం శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు అక్కడే ఇరుక్కుపోతామేమోనని భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానకి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆ భవన నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని..ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. రైస్‌మిల్ యజమానుల పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో