Weather Alert: దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. ఓ వైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వర్షాలు..

ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పింది. అయితే.. వేడిగాలులు ఏర్పడే అవకాశం లేదని తెలిపింది. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Weather Alert: దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. ఓ వైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు  వర్షాలు..
Weather Report
Follow us

|

Updated on: Apr 10, 2023 | 6:51 AM

దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పింది. అయితే.. వేడిగాలులు ఏర్పడే అవకాశం లేదని తెలిపింది.

అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, కేరళలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మరోవైపు.. మధ్య, తూర్పు భారతదేశంలోనూ వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, విదర్భలలో మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌ ఉందంది. అలాగే.. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షం పడనున్నట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
మన ప్రొడక్షన్‌ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్‌.. వారు ఎవరంటే.?
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ..!
పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల
పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల
అమ్మాయిలూ ఇది మీకు తెలుసా.! మగవారి గురించి 10 సీక్రెట్స్ ఇవే..
అమ్మాయిలూ ఇది మీకు తెలుసా.! మగవారి గురించి 10 సీక్రెట్స్ ఇవే..
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?