Helmet Man of India: ఓ వ్యక్తి వినూత్నమైన సేవ.. ఇల్లు అమ్మి మరీ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ

ఓ రోజు రాఘవేంద్ర కుమార్‌ స్నేహితుడు బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి బైక్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర ఆవేదనచెందాడు రాఘవేంద్ర.

Helmet Man of India: ఓ వ్యక్తి వినూత్నమైన సేవ.. ఇల్లు అమ్మి మరీ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ
Helmet Man Of India
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 2:57 PM

జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవి మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనతో ఆయన ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు వెళ్తూ ఎవరైనా కనిపిస్తే వెంటనే అతణ్ని ఆపేస్తాడు. వెంటనే ఆ వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని చెంపి పంపిస్తాడు. అతనే బీహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్. అతను ఇలా చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటంటే..

ఓ రోజు రాఘవేంద్ర కుమార్‌ స్నేహితుడు బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి బైక్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర ఆవేదనచెందాడు రాఘవేంద్ర. ఆదే ఆయనలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడిలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఆయన 56,000 హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశాడు.

ఈ సేవ కోసం ఆయన గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్ ను అమ్మేసాడు. అంతేకాదు, తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి మరీ ఉచిత హెల్మెట్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాడు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం రాఘవేంద్ర కుమార్ సేవలను ప్రశంసించారు. దీంతో రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!