PM Modi: ఎలిఫెంట్ విస్పరర్స్ నటులు బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని.. ఏనుగు రఘుకు చెరకు తినిపించి ముద్దు చేసిన మోడీ
ముదుమలై పులుల పరిరక్షణ కేంద్రాన్ని ఈ రోజు సందర్శించారు మోడీ. అంతేకాదు ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ లో నటించిన బొమ్మన్, వల్లిలను కలిశారు. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్ళిన ప్రధాని దానిని ముద్దు చేశారు.. రఘుకు చెరుకుగడలు తినిపించారు.
ఆస్కార్ అవార్డుతో ప్రతిష్టాత్మకంగా మారిన ముదుమలై తమిళనాడు, బందీపూర్ కర్ణాటక సరిహద్దులో ఉన్న మధుమలై టైగర్ రిజర్వ్ ని సందర్శించారు ప్రధాని మోడీ. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ లో కీలకంగా మారిన ముదుమలై పులుల పరిరక్షణ కేంద్రాన్ని ఈ రోజు సందర్శించారు మోడీ. అంతేకాదు ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ లో నటించిన బొమ్మన్, వల్లిలను కలిశారు. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్ళిన ప్రధాని దానిని ముద్దు చేశారు.. రఘుకు చెరుకుగడలు తినిపించారు.
ఇవి కూడా చదవండిప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బాందీపూర్ టైగర్ రిజర్వాయర్కి వెళ్ళిన ప్రధాని కర్నాటకలోని ముదుమలై ఫారెస్ట్‌ని సందర్శించారు. మోడీ పర్యటన సందర్భంగా నీలగిరి జిల్లా, ముదుమలై అటవీప్రాంతాలలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi visits Theppakadu elephant camp pic.twitter.com/vjlrYqbwtG
— ANI (@ANI) April 9, 2023
బాందీపూర్ అభయారణ్యం.. పులులు, ఏనుగులు, జింకలు, అడవిదున్నలు.. ఇలా ఎన్నో రకాల వన్యప్రాణులు, అంతరించిపోయే దశలో జీవరాసులకు ఆలవాలంగా ఉంది. ఇక్కడి ముదుమలైలో ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని చూసేందుకు, వీటికి ఫీడింగ్ చేసేందుకు టూరిస్ట్‌లు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో కనిపించిన రఘు అనే ఏనుగు ఇక్కడే ఉంది. దీనిని చూడడంతోపాటు.. ఆ ఏనుగురు పెంచి పెద్ద చేసిన బొమ్మన్, వల్లిలను కూడా కలిసారు ప్రధాని మోడీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..