Jacqueline Fernandez: జాక్వెలిన్ కు మరో ప్రేమ లేఖ రాసిన కాన్మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్
రూ.200 కోట్ల మనిలాండరింగ్ కేసులో జైలులో గడుపుతున్న కాన్ మ్యాన్ సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి మాత్రం జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు ఉత్తరాలు రాయడం ఆపడం లేదు.

రూ.200 కోట్ల మనిలాండరింగ్ కేసులో జైలులో గడుపుతున్న కాన్ మ్యాన్ సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి మాత్రం జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు ఉత్తరాలు రాయడం ఆపడం లేదు. ఇటీవల హోలీ పండుగ రోజున అలాగే అతని పుట్టిన రోజున జాక్వెలిన్ కు ప్రేమతో ఉత్తరం రాసిన సుఖేష్ ఇప్పుడు తాజాగా ఈస్టర్ సందర్భంగా మరో లేఖ రాశాడు. జాక్వెలిన్ కు ఎంతో ఇష్టమైన ఈస్టర్ సందర్భంగా తనను మిస్ అవుతున్నానని తెలిపాడు. వచ్చే ఈస్టర్ కి ఆమె జీవితంలో ఎప్పుడు జరుపుకోనంత గొప్పగా చేస్తానని హామీ ఇస్తున్నానని రాసుకొచ్చాడు. ఈస్టర్ గుడ్లు జాక్వెలిన్ కు ఇష్టమని… ఆ గుడ్లని ఆమె పగలగొట్టేటప్పుడు ఆమెలో కనిపించే అందమైన చిన్నపిల్లను చూడటం మిస్ అవుతున్నానని తెలిపాడు.
ప్రస్తుతం ఢిల్లీ మండోలి జైల్ లో ఉంటున్న సుఖేష్.. జాక్వెలిన్ లక్స్ కాజీ అడ్వర్టైస్ మెంట్ చూస్తూ ఆమె గురించే ఆలోచిస్తున్నానని తెలిపాడు. ఈ భూమిపై ఆమె కన్న అందెగత్తె మరొకరు లేరని..నా బన్నీ రాబీట్, ఐ లవ్ యూ అంటూ రాసుకొచ్చాడు. జాక్వెలిన్ గురించి ఆలోచించని ఒక్క క్షణం కూడా లేదని..ఆమె కూడా అతని గురించి అలాగే ఆలోచిస్తుందన్న విషయం తనకు తెలుసన్నాడు. అలాగే 1994 నాటి క్రిమినల్ సినిమాలోని ప్రేమ పాటను వింటున్నప్పుడు ఆమె గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాని తెలిపాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..