Corona Virus: ఆ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనా.. గర్భిణీ, వృద్ధులకు మాస్కులు తప్పని చేసిన ప్రభుత్వం..
భారతదేశంలో 10 లక్షల మందిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు చెప్పారు. కేరళలో ఒక రోజులో 1800 కేసులు నమోదైన తర్వాత అక్కడి ప్రభుత్వం వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు మాస్క్ ను తప్పనిసరి చేసింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 6150 కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు వ్యాప్తి నివారణ చర్యలు వేగంగా తీసుకుంటుంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. కరోనా వైరస్‌లో కొత్త రకం స్పైక్ న్యూజిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలవలె ప్రమాదకరం కానప్పటికీ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. భారతదేశంలో 10 లక్షల మందిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు చెప్పారు. కేరళలో ఒక రోజులో 1800 కేసులు నమోదైన తర్వాత అక్కడి ప్రభుత్వం వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు మాస్క్ ను తప్పనిసరి చేసింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 6150 కేసులు నమోదయ్యాయి.
పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాప్తి నివారణకు సన్నాహాలు మళ్లీ జోరందుకున్నాయి. ఐసీయూ బెడ్లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్ స్టాక్ పెంచుతున్నారు. మనదేశంలో వ్యాపిస్తోన్న కొత్త వైరస్ ఇతర దేశాలలో ఉన్నంత ప్రమాదకరం కాదని నిపుణులు కూడా చెబుతున్నప్పటికీ.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 542 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 260 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 535 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా వ్యాప్తి రేటు 23.05 శాతానికి చేరుకుంది.
విదేశాల్లో కరోనా వైరస్ కేరళలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కేసుల నమోదు పెరిగాయి. కేరళలోని ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో గరిష్టంగా ఉంది. న్యూజిలాండ్‌లో ప్రతి మిలియన్ జనాభాకు 293 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో గత వారంలో 10 లక్షలకు 126 కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 163 కేసులు ఉన్నాయి. యూఎస్‌లో 75, యూకేలో 46 కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా పరిస్థితి ప్రస్తుతం కరోనా వ్యాప్తి నమోదు గణాంకాలు చూసిన తర్వాత ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి మరీ దారుణంగా లేదని.. ఇది కాస్త ఊరటనిచ్చే విషయమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి సీనియర్ వైద్యురాలు తనూ సింఘాల్ మాట్లాడుతూ.. కేసులు పెరుగుతున్నాయని, రోగులు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. మనం ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం. జూలై 2022లో ఢిల్లీ, ముంబైలలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..