Narender Vaitla |
Updated on: Apr 09, 2023 | 4:45 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు.
ఈ సందర్భంగా మోదీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్, కామోఫ్లాజ్ టి-షర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.
ఇదిలా ఉంటే ఉంటే.. 1941 ఫిబ్రవరి 19న బందీపూర్ అడవిని రిజర్వ్ ఫారెస్ట్ గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం.
దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు.
ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని.. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేశారు.. అనంతరం రఘుకు చెరుకుగడలు తినిపించారు.