Solar Eclipse 2023: ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏ తేదీలో ఏ సమయంలో ఏర్పడనున్నదంటే..?

ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు సంభవించబోతున్నాయి, వాటిలో రెండు సూర్యగ్రహణాలు. అయితే, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలోనే ఏర్పడనుంది. సూర్యగ్రహణం తేదీ .. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం.

Solar Eclipse 2023: ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏ తేదీలో ఏ సమయంలో ఏర్పడనున్నదంటే..?
Solar Eclipse 2023
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 1:53 PM

హిందూ మతంలో గ్రహణాలు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించబోతున్నాయి. వీటిలో  మొదటి గ్రహణం ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. వాస్తవానికి, ఏప్రిల్ 20, 2023, గురువారం రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం సంభవించబోతోంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం కారణంగా వ్యక్తి రాశిలో కూడా మార్పులు కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహణం కారణంగా ఒక వ్యక్తి జీవితంలోని అనేక విషయాలు ప్రభావితమవుతాయి. అందుకే గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడని పెద్దలు చెబుతారు.

అయితే ఏప్రిల్‌లో ఏర్పడనున్న ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, తూర్పు , దక్షిణాసియాతో సహా హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. ఇది కొందరికి శుభం, మరికొందరికి అశుభం కావచ్చు. అయితే గ్రహణ సమయం గురించి తెలుసుకుందాం.

సూర్య గ్రహణ సమయం ఈ సంవత్సరం, 20 ఏప్రిల్ 2023న వచ్చే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో మొదటి గ్రహణం కానుంది. గ్రహణం ఉదయం 07:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం సమయం మొత్తం వ్యవధి 05 గంటల 24. అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.. కనుక భారతదేశంలో సూత కాలం పరిగణించబడదు.

ఇవి కూడా చదవండి

ఈ గ్రహణం ప్రభావం ఎలా ఉండనున్నదంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో.. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. అంతేకాదు బుధుడు, రాహువు కూడా ఈ రాశి లోకి ప్రవేశిస్తారు. సూర్యగ్రహణం ఏర్పడిన రెండు రోజుల తర్వాత బృహస్పతి తన రాశిని కూడా మార్చుకోనున్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ గ్రహణం చాలా రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే గ్రహణకాలంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని గుర్తుంచుకోండి. దీని ఫలితాలు విరుద్ధంగా ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)