Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse 2023: ఈ నెలలోనే తొలి సూర్యగ్రహణం.. ఎవరికి లాభం, మరెవరికి నష్టం కలిగిస్తుందంటే..?

సనాతన హిందూ ధర్మంలో సూర్యచంద్రుల గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇక వాటిలో రెండు సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు...

Solar Eclipse 2023: ఈ నెలలోనే తొలి సూర్యగ్రహణం.. ఎవరికి లాభం, మరెవరికి నష్టం కలిగిస్తుందంటే..?
First Solar Eclipse of 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 10, 2023 | 6:05 AM

Surya Grahan 2023: సనాతన హిందూ ధర్మంలో సూర్యచంద్రుల గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇక వాటిలో రెండు సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు. మరోవైపు ఈ నెల అంటే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ ఈ సూర్యగ్రహణం అన్ని రాశులవారిని కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సూర్య గ్రహణం కొన్ని రాశులవారికి శుభప్రదంగా, అలాగే మరి కొందరికి అశుభంగా ఉంటుంది. మరి రాశిచక్రంలోని ఏయే రాశులకు ఈ సూర్యగ్రహణం శుభంగానూ.. ఏ రాశులకు అశుభంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులకు సూర్యగ్రహణం అశుభం:

ప్రతి ఏటా ఏర్పడిన మాదిరిగానే ఈ ఏడాది కూడా సూర్యగ్రహణం రెండు సార్లు ఏర్పడనుంది. ఇక 2023 సంవత్సరంలో ఏప్రిల్ 22న మొదటి సూర్యగ్రహణం కలుగుతుంది. అయితే ఈ గ్రహణం మేషం, ధనుస్సు, మకరం, మీన రాశులకు అశుభంగా ఉండనుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే గ్రహణం సమయంలో ఈ 4 రాశులవారికి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. అలాగే  కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మానసిక ఆందోళన ఎదురవుతాయి. ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు.

ఈ రాశులకు సూర్యగ్రహణం శుభం: 

సూర్యగ్రహణం సమయానికి సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తుంటాడు. ఏదైనా రాశిలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటే అది వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడి ఉచ్ఛస్థితి కారణంగా కర్కాటకం, కుంభం, వృశ్చిక రాశులవారు ప్రయోజనం పొందుతారు. ఈ రాశులవారు ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జ్యోతిష్యశాస్త్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్