SRH vs PBKS: హమ్మయ్యా..! ఎట్టకేలకు హైదరాబాద్ ఖాతాలో తొలి విజయం.. గబ్బర్ ‘వన్ మ్యాన్ షో’ వృధా..!

ఎట్టకేలకు ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ జట్టు.. తన మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ తరఫున ఒపెనర్‌గా దిగిన కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయమైన 99 పరుగులతో

SRH vs PBKS: హమ్మయ్యా..! ఎట్టకేలకు హైదరాబాద్ ఖాతాలో తొలి విజయం.. గబ్బర్ ‘వన్ మ్యాన్ షో’ వృధా..!
Sunrisers Hyderabad defeated Punjab Kings By 8 Wickets
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 10, 2023 | 1:14 AM

IPL, 2023, SRH vs PBKS: ఎట్టకేలకు ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ జట్టు.. తన మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ తరఫున ఒపెనర్‌గా దిగిన కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయమైన 99 పరుగులతో వన్ మ్యాచ్ షో చేసినా.. తమ ఎదుట ఉన్న లక్ష్యాన్ని హైదరాబాదీలు సునాయాసంగా చేధించారు. ఈ క్రమంలో హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి 74*, కెప్టెన్ ఐడాన్ మార్క్రమ్ 37 పరుగులతో అజేయంగా రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఇక పంజాబ్ తరఫున ధావన్(99 నాటౌట్) సామ్ కర్రన్(22) మినహా మిగిలినవారెవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. అయితే టీమ్ కెప్టెన్‌గా ధావన్ ఒంటరి పోరాటం చేశాడు. ఇక హైదరాబాద్ తరఫున మయాంక్ మార్ఖాండే 4 వికెట్లతో ప్రత్యర్థులను పడగొట్టగా.. ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్ చెరో 2 , భువనేశ్వర్ 1 వికట్ తీశారు

అనంతరం క్రీజులోకి వచ్చిన అరెంజ్ ఆర్మీ లక్ష్యాన్ని సునాయాసం చేధించినా.. జట్టకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. గత రెండు మ్యాచ్‌లలోనూ తీవ్రంగా విఫలమైన హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్(13) పరుగులకే ఔట్ అయ్యి మరో సారి చేతులెత్తేశాడు. కానీ అతనితో పాటు వచ్చిన మయాంక్ అగర్వాల్ కొంత సేపు నిలకడగా రాణించి 21 పరుగులతో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో హ్యరీ బ్రూక్ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి అజేయమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 144 పరుగుల లక్ష్యంలో 74 పరుగులను అతనే సాధించాడు. అలాగే మయాంక్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మార్క్రమ్ కూడా 37 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అలాగే పంజాబ్ తరఫున రాహుల్ చాహార్, ఆర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..