Health Tips: ఫిట్‌నెస్ కోసం వీటిని అతిగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు కూడా తెలుసుకోండి ఓ సారి..

కొన్ని రకాల ఆహారాలను చాలా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయెజనాలు. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఆహారాలలో అవిశె గింజలు కూడా ఒకటి. వీటితో సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అవిశె గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, లిగ్నన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

Health Tips: ఫిట్‌నెస్ కోసం వీటిని అతిగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు కూడా తెలుసుకోండి ఓ సారి..
Flaxseed Health Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 09, 2023 | 6:55 AM

శారీరక దృఢత్వం కోసం కొందరు జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటారు. మరి కొందరు డైట్ ఫాలో అవుతుంటారు. ఇక డైట్‌లో భాగంగా అనేక రకాల డ్రైనట్స్, డ్రైఫ్రూట్స్‌ని ఆహారంగా తీసుకుంటారు. అయితే వాటిలో కొన్నింటిని చాలా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయెజనాలు. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఆహారాలలో అవిశె గింజలు కూడా ఒకటి. వీటితో సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అవిశె గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, లిగ్నన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పలు పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. అయితే అవిశె గింజలను పరిమితంగా తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలు చేకూరతాయి. అలా కాకుండా పరిమితి దాటి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు తప్పవు. మరి ఈ గింజలతో కలిగే దుష్ప్రభావాలేమిటో ఇప్పుడు చూద్దాం..

అవిశె గింజల దుష్ప్రభావాలు:

డయేరియా: అవిశె గింజలను అతిగా తీసుకుంటే డయేరియా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల వీటిని పరిమితంగా, తగినంతగానే తీసుకోవాలి.

మలబద్ధకం: అవిశె గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల్ మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎలర్జీ సమస్యలు: చాలా మంది అవిశె గింజలను ఎక్కువగా తింటే ఫిట్‌గా ఉండవచ్చనుకుని ఎక్కువగా తీసుకుంటారు. అయితే అది నిజం కాకపోగా ఎలర్జీ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాక దురద, తామర వంటి సమస్యలను కలిగిస్తుంది.

బ్లడ్ షుగర్: డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు అవిశె గింజలను తీసుకోకూడదు. ఎందుకంటే అవిశె గింజలు మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని క్షీణింపచేయగలవు. తద్వారా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది