AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను కట్టేస్తారు.. అందుకు కారణం ఏమిటో తెలుసా..? దాని వెనుక లాజిక్ ఇదేనా..?

మన భారతీయ సంస్కృతిలో విభిన్నకరమైన ఆచారాలను పాటిస్తుంటారు. శుభకార్యాలు మొదలు అశుభాలు వరకు అన్నీ కూడా మన ఆచారసంప్రదాయాలు ప్రకారం అనుసరించడం జరుగుతుంది. పెళ్లికి ఎలా అయితే ఆచారబద్ధమైన పద్ధతి ఉందో చనిపోయిన వ్యక్తికి జరిగే అంత్యక్రియలకు కూడా ఇలా కొన్నిపద్ధతులు,

చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను కట్టేస్తారు.. అందుకు కారణం ఏమిటో తెలుసా..?  దాని వెనుక లాజిక్ ఇదేనా..?
Tied Toes Of Dead Body
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 09, 2023 | 6:25 AM

Share

ప్రతీ సంస్కృతిలో కొన్ని రకాల ప్రత్యేక ఆచారాలు ఉంటాయి. అలాగే మన భారతీయ సంస్కృతిలో కూడా విభిన్నకరమైన ఆచారాలను పాటిస్తుంటారు. శుభకార్యాలు మొదలు అశుభాలు వరకు అన్నీ కూడా మన ఆచారసంప్రదాయాలు ప్రకారం అనుసరించడం జరుగుతుంది. పెళ్లికి ఎలా అయితే ఆచారబద్ధమైన పద్ధతి ఉందో చనిపోయిన వ్యక్తికి జరిగే అంత్యక్రియలకు కూడా ఇలా కొన్నిపద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. వాటి ప్రకారమే అంత్యక్రియల తంతు పూర్తవుతుంది. ఈ ఆచారాలు నిన్న లేదా మొన్న వచ్చినవి కానే కాదు.. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వికులు ఆచరిస్తూ వచ్చారు.  ఇక చనిపోయినవారి అంత్యక్రియలకు ముందు.. అంటే స్మశానానికి తీసుకువెళ్లేముందు మనిషి కాలి బొటన వేళ్ళని కలిపి కడతారు. అలా ఎందుకు కడతారు..? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మనిషి చనిపోయిన తర్వాత వారి కాళ్ళ బొటని వేళ్ళని కట్టడం మన సంస్కృతిలోని ప్రాచీనమైన ఆచారం. ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే.. మనిషి చనిపోయాక రెండు కాళ్ళ బొటని వేళ్ళని కూడా ఒక దారంతో కడతారు. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి ఆత్మ వేరేగా వెళ్ళిపోతుంది. అయితే మనిషి చనిపోయినా తన ఆత్మ ఇంకా ఆ శరీరంలోనే ఉండాలని చనిపోయినవారి బంధువులందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు.

చనిపోయిన వారి శరీరం నుంచి జీవించి ఉన్నవారిలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటుందనేది హిందువుల నమ్మకం. చనిపోయిన శరీరాన్ని విడిచి.. తనను చూసేందుకు వచ్చినవారిలో ప్రవేశించాలని.. అక్కడే తిరగాడాలని భావిస్తుందట. అయితే ఆత్మను అలా చేయనివ్వకుండా.. శరీరంలోనే ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా రెండు కాళ్ల బొటనవేళ్లను కలిపి కడతారు. అయితే  ఈ  ఆచారం వెనుక నమ్మకమే కాక లాజిక్ కూడా ఉంది. అదేమిటంటే.. చనిపోయాక శరీరం బిగుసుకుపోతుంది. ఆ శరీరంలో అప్పుడు చలనం ఉండనందున కాళ్లు పక్కకి పడిపోతాయి. అలా జరగకుండా ఉండేందుకు రెండు కాళ్ళ బొటన వేళ్ళని ఒక దారంతో కడతారు. ఈ ఆచారాన్ని పాటించడానికి ప్రధాన కారణం ఇదే.

ఇవి కూడా చదవండి