White Hair: షాంపూ ఏదైనా సరే, ఇలా ఉపయోగిస్తే చాలు.. రెండే వారాల్లో నల్లని జుట్టు మీ సొంతం..

ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు, జీవనశైలి కారణంగా చాలా మందికి వారి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది లేదా రాలిపోతోంది. ముఖ్యంగా మహిళలో ఎక్కువగా కనిపిస్తున్న తెల్లజుట్టు సమస్య, వారిలోని ఆత్మవిశ్వాసానికి ఆటంకంగా మారుతోంది. అయితే తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం కోసం..

White Hair: షాంపూ ఏదైనా సరే, ఇలా ఉపయోగిస్తే చాలు.. రెండే వారాల్లో నల్లని జుట్టు మీ సొంతం..
White Hair
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 09, 2023 | 6:35 AM

White Hair: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, బట్టతల, తెల్ల జుట్టు, చుండ్రు వంటివి సర్వసాధారణమైన కేశ సమస్యలుగా మారిపోయాయి. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు, జీవనశైలి కారణంగా చాలా మందికి వారి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది లేదా రాలిపోతోంది. ముఖ్యంగా మహిళలో ఎక్కువగా కనిపిస్తున్న తెల్లజుట్టు సమస్య, వారిలోని ఆత్మవిశ్వాసానికి ఆటంకంగా మారుతోంది. అయితే తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం కోసం మన పూర్వీకులు ఓ చక్కని చిట్కాను పాటించేవారు. దానిని పాటిస్తే తెల్ల జుట్టుకు పరిష్కారం పొందినట్టే.  అవును, మనం ప్రతిరోజు వాడే షాంపూలో కొన్ని హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

పైగా ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా సహజ పద్దతిలోనే మన తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. అందుకోసం షాంపూలో రెండు టీ స్పూన్ల టీ పొడి, మెంతి గింజలు, ఉసిరి పొడి కలిపితే సరిపోతుంది. దీని కోసం ఒక గిన్నెలో సగం లీటరు నీటిని తీసుకొని వేడి చేయండి. తర్వాత ఈ నీటిలో అన్ని మిశ్రమ పొడిలను వేయండి. ఈ నీరు సగం వరకు తగ్గేవరకు తక్కువ మంటపై వేడి చేయండి.

చివరిలో ఈ నీటిని చల్లబరిచి ఒక ప్లాస్టిక్ సీసాలో భద్రపరచండి. ఇది పాడవకుండా ఫ్రిజ్‌లో పెడితే ఇంకా మంచిది. ఆపై స్నానం చేసేటప్పుడు షాంపూని నేరుగా జుట్టుకు పట్టించకుండా ఒక గిన్నెలో వేసుకోండి. అందులో ఒక అరకప్పు హెర్బ్స్ వాటర్ వేసి మంచిగా కలపండి. దీనిని జుట్టుకి పట్టించండి. ఇలా వారానికి 2-3 సార్లు తలస్నానం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..