AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knee Pains: మోకాళ్ల నొప్పులా..? వంటింట్లోని పదార్థాలతో ఇలా చేశారంటే.. మీ నొప్పి వారంలోనే పరార్..

సాంప్రదాయ చికిత్సలు, వ్యాయామం, మంచి పోషకాహారం, అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించడం వల్ల మోకాలి నొప్పి సమస్యను తగ్గించవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌లో భాగంగా మూలికలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో..

Knee Pains: మోకాళ్ల నొప్పులా..? వంటింట్లోని పదార్థాలతో ఇలా చేశారంటే.. మీ నొప్పి వారంలోనే పరార్..
Knee Pains
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 09, 2023 | 5:55 AM

Share

మధ్య వయసువారి నుంచి వయసు పైబడినవారి వరకు,  ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యల్లో మోకాలి నొప్పి ఒకటి. ఇది నొప్పి, వాపు, దృఢత్వం వంటి లక్షణాలను కలిగి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. వీటి నుంచి ఉపశమనం కోసం డాక్టర్లు సూచించిన మందులతో పాటు ఆయుర్వేద వైద్యులు కూడా వాడాలని కొన్ని రకాల ఔషధాలు, మూలికలను సూచిస్తుంటారు. సాంప్రదాయ చికిత్సలు, వ్యాయామం, మంచి పోషకాహారం, అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించడం వల్ల మోకాలి నొప్పి సమస్యను వారం రోజుల్లోనే తగ్గించవచ్చు.  ఈ క్రమంలోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌లో భాగంగా మూలికలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. ఉల్లిపాయల మాదిరిగానే ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల ప్రభావాలను తగ్గిస్తుంది.

అలాగే వెల్లుల్లిలోని యాంటీ ఆర్థరైటిక్ ప్రభావం మృదులాస్థి క్షీణత, వాపును తగ్గిస్తుంది. ఆహారంలో విరివిగా ఉపయోగించే అల్లంతోనూ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నొప్పి, వాపును ప్రేరేపించే హార్మోన్-వంటి సమ్మేళనాలు అయిన ల్యూకోట్రైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అణువులను తగ్గిస్తుంది. ప్రత్యామ్నాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో కలబంద ఒకటి. ఇది కీళ్ల నొప్పులకు కూడా ఉపయోగపడుతుంది. ఆహారానికి రంగు, రుచిని అందించడానికి ఉపయోగించే ఒక గొప్ప పదార్థం పసుపు. కీళ్ల నొప్పులు, కండరాల కణజాల వ్యాధులతో సహా అనేక రుగ్మతలకు చికిత్స చేయడానికి చైనీస్ ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు.

యూకలిప్టస్ లీఫ్ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు, యూకలిప్టస్ ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు ఆక్సీకరణను నివారించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులతో సహా మంట-సంబంధిత లక్షణాలను తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ సహాయపడుతుంది. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్క సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపు లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్-రిచ్ కాంపౌండ్స్, ఇవి వాపును తగ్గించి కీళ్లను కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

నోట్: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..