STDs: ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.. ఎయిడ్స్ వంటి ‘శృంగార సమస్యలు’ సంకేతాలే కావచ్చు..!
మారుతున్న కాలంలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STDs) చాలా తేలికగా వ్యాపిస్తున్నాయి. అలాగే వాటిని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు, ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఆ కారణంగానే హెచ్‌ఐవీ వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోతున్నారు. ఇక లైంగికంగా సంక్రమించే..
మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా శృంగారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అవును, శృంగారం వల్ల మనిషిపై ఉండే ఒత్తిడి, టెన్షన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తద్వారా అతను మానసిక ప్రశాంతతను పొందగలుగుతాడు. ఇది మానవ ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే మారుతున్న కాలంలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STDs) చాలా తేలికగా వ్యాపిస్తున్నాయి. అలాగే వాటిని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు, ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఆ కారణంగానే హెచ్‌ఐవీ వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోతున్నారు. ఇక లైంగికంగా సంక్రమించే వ్యాధులు ప్రారంభమయ్యే ముందు మానవ శరీరంలో హెచ్చరిక లక్షణాలు లేదా సంకేతాలు కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలేమిటో తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అవి క్లామిడియా, గనేరియా, హెర్పెస్, హెచ్‌ఐవి వంటి సమస్యలుగా మారతాయి. ఇంకా ఈ వ్యాధులు ఇతరుల నుంచి కూడా సంక్రమించవచ్చు. అసలు లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రాథమిక దశలో కనిపించే లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
లైంగికంగా సంక్రమించే వ్యాధులను సూచించే కొన్ని హెచ్చరిక సంకేతాలివే..
అసాధారణ ఉత్సర్గ: మీ మర్మాంగాల నుంచి ఏదైనా అసాధారణ ద్రవం బయటకు వస్తుందని మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే మీరు వైద్యుడిని సంప్రదించే ముందు మీ మర్మాంగాల నుంచి వచ్చే ద్రవం వాసన, రంగుని గుర్తించే ప్రయత్నం చేయండి.
మూత్ర విసర్జనలో ఇబ్బంది: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి అనిపిస్తే, మీ ప్రైవేట్ భాగాలలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. వారం అంత కంటే తక్కుల రోజులలో ఆ నొప్పి తగ్గకుండా అలాగే ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి మీ సమస్య గురించి వివరించడం మరిచిపోకండి.
జననేంద్రియాల చుట్టూ వాపు: మీ ప్రైవేట్ భాగాల చుట్టూ వాపును కనుక మీరు చూసినట్లయితే, వాటిని విస్మరించకండి. అలాగే జననేంద్రియాల పరిమాణం, ఆకృతిలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స కోసం సూచనలు తీసుకోండి.
జననాంగాలపై దురద: చాలా మంది శృంగారం తర్వాత.. జననాంగాలను శుభ్రం చేసుకోకుండా పడుకుండిపోతారు. అయితే అది మంచి పద్దతి కాదు. ఇంకా అది తామర లేదా దురద సమస్యలకు కారణం కాగలదు. అంతేకాకుండా జననేంద్రియాలపై దురద 3 లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది కూడా లైంగికంగా సంక్రమించే వ్యాధి లక్షణమే.
జననేంద్రియాలలో పుండ్లు: ప్రైవేట్ భాగాల శుభ్రత గురించి సరిగ్గా పట్టించుకోనప్పుడు.. ఆ ప్రాంతంలో పుండ్లు, పొక్కులు ఏర్పడతాయి. ఈ పుండ్లు, బొబ్బలు ఎంతకీ తగ్గనట్లయితే అది లైంగికంగా సంక్రమించే వ్యాధి (STD)కి సంకేతం కావచ్చు.
ఇతర లక్షణాలు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు ప్రైవేట్ ప్రాంతాలకు నేరుగా సంబంధం లేని లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఉదాహరణకు దిగువ పొత్తికడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దద్దుర్లు, అలసట, అతిసారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు HIV వంటి సమస్యకు సంకేతాలు. ఇలాంటి లక్షణాలు మీలో కనిసిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..