Weird Taste: థమ్స్‌అప్ పానీపూరి.. లొట్టలేసుకుంటూ తినేసిన ఆంటీ.. షాక్‌లో నెటిజన్లు..

స్టూడెంట్స్ అయితే స్కూల్ లేదా కాలేజీ అయిపోవడమే ఆలస్యం.. పానీపూరి బండి దగ్గర క్యూ కట్టేస్తారు. ఇక తినేవారు ఎవరైనా పానీపూరి ,  భెల్ పానీపూరి, మసాలా పానీపూరీ, పెగురు పానీపూరి వంటి రకాలనే తింటారు. మరి కొందరైతే సాస్ కలుపుకుని తింటారు. కానీ ఎప్పుడైనా థమ్స్‌అప్ పానీపూరి తిన్నారా..? చెత్త ప్రశ్న అని కొట్టేయకండి..

Weird Taste: థమ్స్‌అప్ పానీపూరి.. లొట్టలేసుకుంటూ తినేసిన ఆంటీ.. షాక్‌లో నెటిజన్లు..
Thumbs Up Panipuri
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 09, 2023 | 6:30 AM

మనలో చాలా మంది పానీపూరిని తినేందుకు ఇష్టపడతారు. ఇక స్టూడెంట్స్ అయితే స్కూల్ లేదా కాలేజీ అయిపోవడమే ఆలస్యం.. పానీపూరి బండి దగ్గర క్యూ కట్టేస్తారు. ఇక తినేవారు ఎవరైనా పానీపూరి ,  భెల్ పానీపూరి, మసాలా పానీపూరీ, పెగురు పానీపూరి వంటి రకాలనే తింటారు. మరి కొందరైతే సాస్ కలుపుకుని తింటారు. కానీ ఎప్పుడైనా థమ్స్‌అప్ పానీపూరి తిన్నారా..? చెత్త ప్రశ్న అని కొట్టేయకండి.. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో థమ్స్‌అప్ పానీపూరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అంతేనా.. థమ్స్‌అప్ పానీపూరి తిన్న ఓ ఆంటీ చాలా బాగుంది అన్నట్లుగా సైగా కూడా చేసి లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అవును, చదవడానికి విడ్ఢూరంగా ఉన్నా కూడా ఇది నిజమే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియోలో పానీపూరి స్టాల్ ఓనర్ పానీపూరి నీళ్లకు బదులుగా థమ్స్‌అప్ డ్రింక్‌ని పాత్రలో పోస్తాడు. ఆ తర్వాత పానీపూరిలో పోసి తన మహిళా కస్టమర్‌కి సర్వ్ చేస్తాడు. దానిని తినేసిన ఆ మహిళ ‘చాలా బాగుంది(బహుత్ బఢియా)’ అని సైగా చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

థమ్స్‌అప్ పానీపూరి వీడియోను ఇక్కడ చూడండి..

థమ్స్‌అప్ పానీపూరి వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆంటీ టేస్ట్‌కి పెద్ద దండం పెట్టాలని కొందరు.. అసలు ఆ షాకింగ్ ఐడియా ఎలా వచ్చిందని ఇంకొందరు.. ఇలా చేస్తే విరోచనాలు ఖాయమని మరికొందరు కామెంట్ చేశారు. అలాగే ఈ వీడియోకు ఇప్పటివరకు 53 వేల లైకులు.. 17 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా ఈ వీడియోను అనేక మంది షేర్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.