- Telugu News Photo Gallery Cinema photos Taapsee pannu 6 Pack six pack photos goes attractive in social media on 08 04 2023 Telugu actors photos
Taapsee pannu 6-Pack: ముట్టుకుంటే మాసిపోతుందేమో.. ఏంటీ అందం తాప్సీ.. సిక్స్ ప్యాక్‌లో మరింత స్పైసీగా..
తాప్సీ.. గతకొద్ది రోజులుగా హార్డ్ వర్కౌట్స్ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ పిక్ షేర్ చేసింది. అందులో తాప్సీ సిక్స్ ప్యాక్స్ బాడీ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.
Updated on: Apr 09, 2023 | 10:00 AM

తాప్సీ పన్ను.. టాలీవుడ్‌తో కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40చిత్రాలకు పైగా నటించిన ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్, బయోపిక్‌లు అంటూ కెరీర్లో దూసుకెళ్తోంది.

కొన్ని రోజులుగా హార్డ్ వర్కౌట్స్ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ పిక్ షేర్ చేసింది. అందులో తాప్సీ సిక్స్ ప్యాక్స్ బాడీ చూసి అంతా షాకవుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. అయితే తాప్సీ.. గతకొద్ది రోజులుగా హార్డ్ వర్కౌట్స్ చేస్తుంది.

తాజాగా ఫిట్నెస్ ట్రైనర్‌తో ఫొటోలను షేర్ చేసింది. అందులో నటి.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించింది.

కొన్ని నెలలు బాగా కష్టపడ్డానని ఇక తను బిస్కెట్లు తినొచ్చు టీ తాగొచ్చని దాంతో పాటే చోళే భటూరే, croissants లాగిస్తానని రాసుకొచ్చింది.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంటూ డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తాను ఉన్న ఈ వృత్తిలో ఎప్పుడు ఫిట్‌గా ఉండడం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తానని తెలిపింది.

ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అంతేకాకుండా శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదని మారిపోతూ ఉంటుందని చెప్పింది.

అందుకే తాను తన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి డైటీషియన్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పింది. ప్రతీ నెలా ఎంత ఖర్చు అవుతుంది అని అడగగా..

తన డైటీషియన్ కోసం నెలకు లక్షకు పైగానే ఖర్చు చేస్తానని చెప్పింది తాప్సీ. ఈ విషయంలో ఎప్పుడూ తన తల్లిదండ్రలతో తిట్లు కూడా తింటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఖర్చులను తన తండ్రి అంగీకరించరని పేర్కొంది.
