AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆ వైన్‌తో గుండెకు ఆరోగ్యం, క్యాన్సర్‌కి చెక్..? నిపుణులు ఏమంటున్నారంటే..

మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. అయితే కొన్ని రకాల డ్రింక్స్‌ని పరిమితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది నిజమే, ముఖ్యంగా రెడ్ వైన్‌తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రెడ్‌వైన్‌తో గుండెను రక్షించుకోవడంతో పాటు క్యాన్సర్, డయాబెటీస్ వంటి..

Health Tips: ఆ వైన్‌తో గుండెకు ఆరోగ్యం, క్యాన్సర్‌కి చెక్..? నిపుణులు ఏమంటున్నారంటే..
Red Wine
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 09, 2023 | 6:33 AM

Share

మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. అయితే కొన్ని రకాల డ్రింక్స్‌ని పరిమితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది నిజమే, ముఖ్యంగా రెడ్ వైన్‌తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రెడ్‌వైన్‌తో గుండెను రక్షించుకోవడంతో పాటు క్యాన్సర్, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రెడ్‌వైన్‌లో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసినవిగా ఉన్నందునే ఇది సాధ్యమని వారు వివరిస్తున్నారు. అసలు రెడ్‌వైన్‌తో మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యంరెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు గుండెలోని రక్తనాళాల పొరను రక్షించగలవు. అలాగే ధమనులలో ఫలకాలు ఏర్పడకుండా నిరోధించడం, రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తి: రెడ్ వైన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా ఇది కడుపులో మంటను తగ్గించడంలో, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్‌ నిరోధిని: రెడ్ వైన్‌లోని రెస్‌వెరాట్రాల్‌కు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నట్లు అధ్యయానాలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది, అలాగే క్యాన్సర్ కణితుల అభివృద్ధిని నిరోధిస్తుంది.

బరువు తగ్గడం: రెడ్ వైన్‌లో ఉండే పిసిటానాల్ అనే సమ్మేళనం కొవ్వు కణాలు ఏర్పడకుండా చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు ఊబకాయం సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

చర్మ సంరక్షణ: రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, అకాల వృద్ధాప్యాన్ని నివారించడం ద్వారా చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి. మొటిమలను తగ్గించడంలో, చర్మం రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. 

మానసిక ఆరోగ్యం: రెడ్ వైన్‌లోని రెస్వెరాట్రాల్ మెదడుపై కూడా సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఇది అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రెడ్ వైన్ వినియోగం పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

డయాబెటిస్: రెడ్ వైన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

దీర్ఘాయువు: రెడ్ వైన్ ఆరోగ్య ప్రయోజనాలు దీర్ఘాయువుకు దోహదం చేస్తాయి. రెడ్ వైన్‌ను పరిమితంగా తీసుకుంటే దీర్ఘకాల జీవితకాలంతో పాటు అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..