AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2023: వచ్చే నెలలోనే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు కనకవర్షం ఖాయం.. అన్నింటా విజయం..!

ప్రతి ఏటా ఏర్పడిన మాదిరిగానే ఈ ఏడాది కూడా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 20న మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుండగా.. వచ్చే నెల అంటే మే 5న తొలి చంద్రగ్రహణం కలగనుంది. ఈ సూర్యచంద్రుల గ్రహణాలకు మన సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య..

Lunar Eclipse 2023: వచ్చే నెలలోనే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు కనకవర్షం ఖాయం.. అన్నింటా విజయం..!
Lunar Eclipse
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 10, 2023 | 6:35 AM

Share

Chandra Grahan 2023: ప్రతి ఏటా ఏర్పడిన మాదిరిగానే ఈ ఏడాది కూడా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 20న మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుండగా.. వచ్చే నెల అంటే మే 5న తొలి చంద్రగ్రహణం కలగనుంది. ఈ సూర్యచంద్రుల గ్రహణాలకు మన సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులను కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే ఇవి కొన్ని రాశులవారి జీవితాల్లో పెను ప్రమాదాలను, ఆకస్మిక లాభయోగాలను కూడా కలిగించగలవు. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మే 5న(శుక్రవారం) ఉదయం 08.45 నిమిషాలకు ప్రారంభమై.. మరుసటి రోజు అంటే మే 6 తెల్లవారు జామున ఒంటి గంటకు ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది ఏర్పడే ఈ మొదటి చంద్రగ్రహణం రాశి చక్రమంలోని 3 రాశులపై ప్రయోజనకర లాభాలను చూపించనుంది. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

ఈ 3 రాశులకు 2023లో తొలి చంద్రగ్రహణం ప్రయోజనకరం:

మేషరాశి: ఈ ఏడాది మే5న ఏర్పడే చంద్రగ్రహణం మేషరాశివారికి ఎంతో ప్రయోజనకరం. ఈ గ్రహణ సమయంలో మేషరాశివారి వ్యాపారంలో పురోగతి, ఉద్యోగులకు ప్రమోషన్, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అభిస్తాయి. అలాగే వ్యాపారులు తమ వృత్తిలో వృద్ధి పొందుతారు.

సింహరాశి: సింహరాశివారికి కూడా ఈ చంద్రగ్రహణం కలిసి వస్తుంది. ఈ గ్రహణ సమయంలో సింహరాశివారు కొత్త పనులను ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారికి కోర్టు కేసుల్లో విజయం, ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మకరరాశి: మే 5న కలిగే చంద్రగ్రహణం మకరరాశివారికి కూడా శుభప్రదమేనని చెప్పుకోవాలి. ఈ సమయంలో మకరరాశివారికి ప్రమోషన్.. అలాగే కొత్త ఆస్తులను లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక మకరరాశివారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్నివైపుల నుంచి కూడా సహాయసహకారాలు అందుతాయి.

మరిన్ని జ్యోతిష్యశాస్త్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం