Marriage Yoga: ఈ ఐదు రాశుల వారికి త్వరలో వివాహ యోగం.. వారు హనిమూన్‌కు భారీ ఖర్చు చేస్తారు..!
Marriage Yogam: జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం, మధురానుభూతి హనీమూన్. జ్యోతిష శాస్త్రంలో ఈ ప్రేమ యాత్రకు శుక్ర, చంద్ర గ్రహాలను కారకులుగా నిర్ణయించారు. ఇందులో శుక్రుడు శృంగారానికి, చంద్రుడు ప్రయాణాలకు కారకులు.
Marriage Yoga: జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం, మధురానుభూతి హనీమూన్. జ్యోతిష శాస్త్రంలో ఈ ప్రేమ యాత్రకు శుక్ర, చంద్ర గ్రహాలను కారకులుగా నిర్ణయించారు. ఇందులో శుక్రుడు శృంగారానికి, చంద్రుడు ప్రయాణాలకు కారకులు. ఈ ఏడాది వివాహ యోగానికి అవకాశం ఉన్న వారు ఏ విధమైన ప్రేమ యాత్రలకు వెళతారు అన్నది ఆసక్తికరమైన అంశం. ఈ ఏడాది కొన్ని రాశులకు వివాహ యోగంతో పాటు ప్రేమ యాత్రలకు కూడా అవకాశం ఉన్న రాశులు మేషం, మిధునం, సింహం, తుల, మీనం. ప్రేమ యాత్రలకు సంబంధించి ఈ రాశుల అభిరుచులు, ఉద్దేశాలు వగైరాలను ఇక్కడ పరిశీలిద్దాం.
- మేష రాశి: ఈ రాశి వారికి మే, జూలై నెలల మధ్య వివాహం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి వారు పెద్దపెద్ద నగరాలకు లేదా అటవీ ప్రాంతాలకు హనీమూన్ వెళ్ళటానికి అవకాశం ఉంది. వర్షంలో ఎంజాయ్ చేయడానికి లేదా తిరగటానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. వీరు తమ జీవిత భాగస్వామికి కూడా ఇటువంటి అభిరుచులే ఉండాలని ఆశిస్తారు. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో జూలై, నవంబర్ నెల మధ్య హనీమూన్ కు వెళ్లే అవకాశం ఉంది. హనీమూన్ లో కూడా వీరు విలాసాల మీద భారీగా ఖర్చు చేయడం జరుగుతుంది.
- మిథున రాశి: ఈ రాశి వారికి మే తరువాత వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారి అభిరుచులు ఇతర రాశుల వారికి భిన్నంగా ఉంటాయి. పెళ్లికి ముందే హనీమూన్ కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరికి ప్రకృతి సౌందర్యం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వీరు ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధపడతారు. ఎక్కువగా తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా రమణీయ దృశ్యాల మధ్య కాలక్షేపం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. వివాహం తర్వాత ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఆగస్టు సెప్టెంబర్ నెలలలో హనీమూన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
- సింహ రాశి: ఈ రాశి వారికి జూలై తరువాత నవంబర్ లోపల వివాహం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఇతరులతో కలవటానికి లేదా జనంతో కిటకిట లాడిపోయే ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడరు. అందువల్ల సాధారణంగా మారుమూల ప్రాంతా లను, అడవులను, కొండలను, లోయలను తమ ప్రేమ యాత్రలకు ఎంచుకుంటారు. ఏకాంతం కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా సిద్ధపడ తారు. అంతేకాక, తాము ఎక్కడికి హనీమూన్ వెళ్ళేది మూడో కంటికి తెలియనివ్వరు. సాధారణంగా ఈ రాశి వారు అక్టోబర్ నవంబర్ నెలల మధ్య చలికాలంలో హనీమూన్ వెళ్లడం జరుగుతుంది.
- తులా రాశి: ఈ రాశి వారు ప్రధానంగా శృంగార ప్రియులు. వీరికి జూలై తరువాత తప్పకుండా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యం పుష్కలంగా ఉన్న ప్రాంతాలకు, బాగా ఎత్తైన ప్రదేశాలకు హనీమూన్ వెళ్ళటానికి వీరు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు ఎంతో ముందుగా భారీ ప్రణాళికను రూపొందించుకుంటారు. ఇక రేపు అనేదే లేదు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు. తాము ఎంజాయ్ చేయడంతో పాటు ఇతరులు ఆనందించడానికి కూడా కృషి చేస్తారు. శుక్ర చంద్రులు బాగా బలంగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలలలో ఈ రాశి వారు ప్రేమ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
- మీన రాశి: ఈ రాశి వారికి మే, ఆగస్ట్ నెలల మధ్య వివాహ యోగం పట్టవచ్చు. హనీమూన్ వెళ్ళడానికి వీరు సాధారణంగా జలపాతాలను, పుణ్యక్షేత్రాలను, మనుషులు చొరలేని ప్రాంతాలను ఎంపిక చేసు కోవడం జరుగుతుంది. సాధారణంగా వ్యసనాల జోలికి పోవడం ఇష్టం లేని ఈ రాశి వారు ఎక్కు వగా వివిధ రకాల భోజనాలు, ఫలహారాలు లభించే ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. వీరు ప్రేమ యాత్రకు వెళ్లినా ఆల యాల సందర్శనను మాత్రం మరిచిపోయే అవ కాశం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణకు మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇవ్వటం వీరి నైజం.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..