Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, అధికార యోగం.. 12 రాశులవారికి వారఫలాలు ఇలా.. (9-15 ఏప్రిల్ 2023)
Weekly Horoscope (09-15 ఏప్రిల్ 2023): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం(09 ఏప్రిల్ 2023) నుండి వచ్చే శనివారం (15 ఏప్రిల్ 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Weekly Horoscope (09-15 ఏప్రిల్ 2023): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఆదివారం(09 ఏప్రిల్ 2023) నుండి వచ్చే శనివారం (15 ఏప్రిల్ 2023) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రావడం లేదా మరింత మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావడం వంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన ఆశలు, కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరటానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. పిల్లలు ఊహించనంతగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఐటీ నిపుణులు, ఇతర వృత్తి వ్యాపారాల వారు ఆర్థికంగా ముందుకు దూసుకువెళతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. అయితే, ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.ప్రయాణాల వల్ల లాభపడతారు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, ఆర్థికంగా మంచి కాలం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారు లాభాల పంట పండించుకుంటారు. వివాహం కాని వారికి పెళ్లి యోగం ఉంది. ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది.ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉంటున్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవితానికి సంబంధించి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కూడా అధికార యోగం పట్టే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడటానికి అవకాశం ఉంది. వ్యాపారులు భాగస్వాములతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని విస్తరించే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి బంధువర్గంలోనే సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానయోగం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. భారీగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది.ః
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలను తీసుకోవలసి వస్తుంది. ఇక అష్టమ శని కారణంగా కొన్ని ఊహించని చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ పరంగా ఆచితూచి కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. నమ్మిన వారు మోసగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అతిజాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ప్రేమవ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలపరంగా చిన్నచిన్న సమస్యలు అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. స్నేహితులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అద్దె ఇంట్లో ఉన్నవారైతే ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి కాని వారికి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ ఇతరులకు మాత్రం బాగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నమ్మిన వారు కొందరు డబ్బు నష్టం కలిగిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వద్దు, తీసుకోవద్దు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందడం వల్ల రుణ సమస్యలు చాలావరకు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. అయితే, ఏ ఉద్యోగంలో చేరినప్పటికీ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. శ్రమ, ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. అనవసర వస్తువుల మీద దుబారా చేయడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశి వారికి అదృష్ట యోగం పడుతుంది. అధికార యోగానికి, గృహ, వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పెళ్లి కాని వారికి బంధు వర్గంలో మంచి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఊహించనంతగా పురోగతి సాధించే సూచనలున్నాయి. ఆరోగ్యం మీద మాత్రం ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించవచ్చు. వ్యాపారులు విశేషంగా లాభాలు గడిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. బాగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఐటీ తదితర వృత్తుల వారు బాగా రాణిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశి వారికి మనసులోని కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించడం జరుగుతుంది. అదృష్ట యోగానికి, ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి తీపి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. డబ్బు నష్టం కూడా జరగవచ్చు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాల మీద మితిమీరి ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. పిల్లలు విశేషంగా పురోగతి సాధిస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఎలా ఉంటాయి. స్నేహితులకు, బంధువులకు ఆర్థికంగా సహాయం చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు యధాతధంగా కొనసాగుతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో సహచరులకు అండగా నిలుస్తారు. ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ఇతరుల సమస్యలను తలదూర్చవద్దు. విద్యార్థులు శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా అనుకూలంగా ఉండవు. కోర్టు కేసులు సాచివేత ధోరణిలో కొనసాగుతాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): విదేశాల్లో ఉద్యోగాలకి, విదేశాలలో చదువులకి, విదేశీయానానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చు అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా తీసుకునే కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు ఎంతో శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. ప్రేమవ్యవహారం ఫలిస్తుంది.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..