Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Ketu Tips: జాతకంలో రాహు, కేతు దోషమా.. నివారణ కోసం ఈ సింపుల్ పరిష్కారాలను అనుసరించండి

వారి ప్రతి పనిలో అవాంఛనీయ అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. పేదరికాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంది. అయితే, జ్యోతిషశాస్త్రంలో  రాహు-కేతువుల దుష్ప్రభావాలను తొలగించడానికి అనేక చర్యలు పేర్కొన్నారు.

Rahu Ketu Tips: జాతకంలో రాహు, కేతు దోషమా.. నివారణ కోసం ఈ సింపుల్ పరిష్కారాలను అనుసరించండి
Rahu Ketu Dosh
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2023 | 11:50 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, కేతువులను దుష్ట గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల పేర్లు వింటే చాలామంది భయపడతారు. రాహువు, కేతువుల వల్ల కాలసర్ప దోషం ఏర్పడుతుందని నమ్మకం. ఏ జాతకంలో రాహువు, కేతువుల లోపం ఉంటే వారి జీవితంలో చాలా సమస్యలు మొదలవుతాయి. వారి ప్రతి పనిలో అవాంఛనీయ అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. పేదరికాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంది. అయితే, జ్యోతిషశాస్త్రంలో  రాహు-కేతువుల దుష్ప్రభావాలను తొలగించడానికి అనేక చర్యలు పేర్కొన్నారు. ఈ చర్యల వలన శుభ ఫలితాలను పొందడమే కాకుండా.. అతని జీవితంలోని అడ్డంకులను కూడా తొలగిస్తాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో.. రాహు-కేతు దోషాన్ని తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాం.

రాహువుకు సంబంధించిన పరిహారాలు పరమేశ్వరుడైన మహాదేవుని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు రాహువు కష్టాలు నుండి తప్పించుకోవాలంటే.. నియమ, నిబంధనల ప్రకారం ప్రతిరోజూ శివుని పూజించండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు  వలన కలిగే సమస్యలను తొలగించడానికి దానం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో శనివారంరోజున అవసరమైన వ్యక్తికి బట్టలు, ఆహారం మొదలైనవి దానం చేయండి. ఇది మీ జీవితంలో సుఖ సంతోషాలు తెస్తాయి.

ఇవి కూడా చదవండి

మంత్రాలను పఠించడం ద్వారా రాహువు వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించవచ్చని విశ్వాసం. ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఓం ఓం భ్రాం భ్రాం భ్రాం సః రాహవే నమః మంత్రాన్ని జపించండి. అంతేకాదు ఇంట్లోని పూజా స్థలంలో రాహు యంత్రాన్ని అమర్చండి.

కేతువుకు సంబంధించిన పరిహారాలు కేతువు చెడు ప్రభావాలను నివారించడానికి దానం, దక్షిణ కూడా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. అటువంటి పరిస్థితిలో మీరు కేతువు శుభ ఫలితాలు పొందాలనుకుంటే.. నువ్వులు, వస్త్రాలు, ముల్లంగి మొదలైన వాటిని దానం చేయండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కేతువుకి ఇష్టమైన రోజు ఆదివారంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కేతువుకు సంబంధించిన పరిహారాలు చేయడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున చేసే పూజలు మరింత ప్రయోజనకరంగా భావిస్తారు.

కేతువుతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలను తొలగించడానికి ‘ఓం స్రాన్ శృణ్ శ్రౌన్ స్: కేత్వే నమః’ అనే మంత్రాన్ని పఠించండి. దీని వలన కేతు చెడు ప్రభావం తొలగి .. చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్