AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం .. ఈ నాలుగు రాశులపై ప్రభావం.. ఆర్ధికంగా ఇబ్బందులు అందులో మీరున్నారా చెక్ చేసుకోండి

ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుందని అంచనా. అయితే, ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తుల ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని జ్యోతిష్కులు చెబుతున్నారు. సూర్య గ్రహణ ప్రభావం పడే ఈ రోజు ఆ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Solar Eclipse: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం .. ఈ నాలుగు రాశులపై ప్రభావం.. ఆర్ధికంగా ఇబ్బందులు అందులో మీరున్నారా చెక్ చేసుకోండి
First Solar Eclipse
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 11:09 AM

Share

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 07:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. వైశాఖ పూర్ణిమ రోజున ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం. పురాణాల ప్రకారం.. సూర్య , చంద్ర గ్రహణాలు రాహు , కేతువుల వల్ల సంభవిస్తాయని నమ్మకం.

ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుందని అంచనా. అయితే, ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తుల ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని జ్యోతిష్కులు చెబుతున్నారు. సూర్య గ్రహణ ప్రభావం పడే ఈ రోజు ఆ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేషరాశి : 2023 మొదటి సూర్యగ్రహణం ఈ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావం చూపుతుందని అంచనా  వేస్తున్నారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలతో సహా ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. కనుక ఈ రాశివారు  తమ భాగస్వాములతో ఎలాంటి వాదనలు చేయకుండా వివాదాలు ఏర్పడకుండా దూరంగా ఉండి ఓపికగా ఉండడం మంచిది. ఈ సమయంలో ఆర్థికంగా బలహీనంగా ఉండవచ్చు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి : సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి దుబారా వల్ల డబ్బుకు లోటు ఏర్పడవచ్చు. దీన్ని నివారించడానికి..  ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ సమయంలో ఈ రాశివారు భావోద్వేగాలు, భాషపై నియంత్రణను కలిగి ఉండటం చాలా కీలకం.  ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలలో పరిణామాలకు దారితీయవచ్చు. ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ రాశివారు వృత్తి, వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు.. కనుక ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది.

కన్య రాశి : రాబోయే సూర్యగ్రహణం ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో కొన్ని సవాళ్లను తెస్తుంది. సహోద్యోగుల నుండి మద్దతు లేకపోవడం, ఉన్నతాధికారులతో సంబంధాలు దెబ్బతినడం వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో నిమగ్నమైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు.

తుల రాశి : ఈ రాశి వారు సూర్యగ్రహణం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్యగ్రహణం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులు రుణాలు ఇవ్వడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది. డబ్బులు ఆదా చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..