Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హనుమాన్‌ జయంతిన అద్భుత దృశ్యం.. ఆశ్రమంలో సహపంక్తి భోజనం చేసిన వానర సైన్యం

ముందుగా ఆహారం వడ్డించడానికి ప్లేట్లు పెట్టారు. అప్పుడు దానిని తమకు ఆహ్వానంగా అందుకున్న వానర సైన్యం నేరుగా చెట్టు నుండి క్రిందికి దిగి వచ్చి వరుసగా కూర్చున్నాయి. ఒక్కో కోతికి ఒక ప్లేటు ఆహారం ఇచ్చారు. ఈ వంటకంలో మంచి స్వీట్ల విందు కనిపించింది

Viral Video: హనుమాన్‌ జయంతిన అద్భుత దృశ్యం.. ఆశ్రమంలో సహపంక్తి భోజనం చేసిన వానర సైన్యం
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2023 | 10:33 AM

హనుమాన్‌ జయంతి రోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మహరాష్ట్రలోని ఓ ప్రాంతంలో కొండముచ్చులు ఎంతో బుద్ధిగా సహపంక్తి భోజనం చేశాయి. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్ర అకోలా జిల్లా బాషిటేకడి తాలూడా కోతడి గ్రామంలోని ముంగాసాజి మహరాజ్‌ ఆశ్రమంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు.

ముందుగా ఆహారం వడ్డించడానికి ప్లేట్లు పెట్టారు. అప్పుడు దానిని తమకు ఆహ్వానంగా అందుకున్న వానర సైన్యం నేరుగా చెట్టు నుండి క్రిందికి దిగి వచ్చి వరుసగా కూర్చున్నాయి. ఒక్కో కోతికి ఒక ప్లేటు ఆహారం ఇచ్చారు. ఈ వంటకంలో మంచి స్వీట్ల విందు కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఆశ్రమ నిర్వాహకులు వాటిని చెదరగొట్టకుండా ఆ మూగజీవులకు కూడా భోజనం వడ్డించారు. అవి కూడా తమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఎంతో భక్తితో బుద్ధిగా కూర్చుని మనుషులతో కలిసి సహపంక్తి భోజనం చేశాయి.

ఆ దృశ్యం చూడ్డానికి ‘క్రమశిక్షణలో మాకు మించినవారు లేరు’ అన్నట్టుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి తెగ వైరల్‌ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఔరా.. ఎంత భక్తి.. ఇవి కొండముచ్చులా.. వానర సైన్యమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వానరాల క్రమశిక్షణ మనుషులకు కూడా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు కొందరు..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో