AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అమెజాన్ లో ఉద్యోగం వదిలి అందంతో ఓన్లీ ఫ్యాన్స్‌తో నెలకు రూ. 24 లక్షల సంపాదిస్తున్న యువతి

ఓ 25 ఏళ్ల అమ్మాయి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ యువతి హాలీవుడ్ నటి మేగాన్ ఫాక్స్ లా ఉంటుంది. ఇదే విషయాన్నీ తరచుగా ఆ యువతికి పలువురు చెబుతూ ఉంటారు. దీంతో ఆ అమ్మాయి అమెజాన్ లోని ఉద్యోగాన్ని వదిలేసి తన అందాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నెలకు 24 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. 

Viral News: అమెజాన్ లో ఉద్యోగం వదిలి అందంతో ఓన్లీ ఫ్యాన్స్‌తో నెలకు రూ. 24 లక్షల సంపాదిస్తున్న యువతి
Taylor Ryan
Surya Kala
|

Updated on: Apr 04, 2023 | 3:53 PM

Share

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ.. మనుషులను పోలిన మనుషులు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సినీ, క్రీడాకారులు, రాజకీయ నేతల వంటి ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తుల వంటి మరొక వ్యక్తిని చూస్తే చాలు అందరూ ఆసక్తిగా చూస్తారు. అలాంటి ఓ 25 ఏళ్ల అమ్మాయి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ యువతి హాలీవుడ్ నటి మేగాన్ ఫాక్స్ లా ఉంటుంది. ఇదే విషయాన్నీ తరచుగా ఆ యువతికి పలువురు చెబుతూ ఉంటారు. దీంతో ఆ అమ్మాయి అమెజాన్ లోని ఉద్యోగాన్ని వదిలేసి తన అందాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నెలకు 24 లక్షల రూపాయలు సంపాదిస్తోంది.

ఇంగ్లిష్ కౌంటీ ఆఫ్ డెవాన్‌కు చెందిన టేలర్ ర్యాన్ ఐదేళ్ల క్రితం వరకూ అమెజాన్‌లో డెలివరీ డ్రైవర్‌గా ఉద్యోగం చేసేది అయితే ఆమెను చూసిన వారందరూ.. నువ్వు హాలీవుడ్ నటి మేగాన్ ఫాక్స్ లా ఉన్నావని చెప్పేవారు. దీంతో చేస్తోన్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. ఓన్లీ ఫ్యాన్స్ మోడల్‌ గా మారింది. ప్రస్తుతం టేలర్ ‘మేగాన్ ఫాక్స్’గా ప్రసిద్ధి చెందింది. తాను మేగాన్ లా ఉంటానని  తెలుసుకున్నప్పుడు..  ఎక్కువ డబ్బు సంపాదించాలనే తన కలకి రెక్కలు వచ్చినట్లు భావించింది. అంతే అమెజాన్ లోని డెలివరీ డ్రైవర్ ఉద్యోగాన్ని విడిచి పెట్టింది.  ఓన్లీ ఫ్యాన్స్ మోడల్‌గా మారింది.

భారీ మొత్తంలో డబ్బు సంపాదన కేవలం ఫ్యాన్స్‌ పేజీలో తన చిత్రాలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించానని టేలర్ చెప్పింది. ముఖ్యంగా మేగాన్ ఫాక్స్ లా డ్రెస్సింగ్ తో పాటు హావభావాలను కాపీ కొట్టింది. టేలర్ ఈ శైలిని ప్రజలు చాలా ఇష్టపడ్డారు.. క్రమంగా ఫేమస్ అయింది. అంతేకాదు ఆదాయం కూడా పెరిగింది. టేలర్ చెప్పిన ప్రకారం… ఆమె ప్రతి నెలా దాదాపు 30 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో 24 లక్షలకు పైగా  సంపాదిస్తోంది.

ఇవి కూడా చదవండి

25 ఏళ్ల టేలర్ ఒక సెలబ్రిటీకి కార్బన్ కాపీ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పింది. మేగాన్ ఫాక్స్ జీవనశైలిని అనుకరించాలి. రోజువారీ వ్యవహారశైలి, వైఖరిని అనుకరించాలి. అంతేకాదు కంటెంట్‌ని రూపొందించడానికి టేలర్ రోజూ 9 గంటలు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. కొన్నిసార్లు అర్థరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 4 గంటల వరకు పని చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 55 వేల మంది టేలర్‌ను అనుసరిస్తున్నారు.. ఆమె తరచుగా తన బోల్డ్ చిత్రాలను షేర్ చేస్తూ ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..