Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan: ఆ దేశంలో రంజాన్‌ మాసంలో ఎఫ్‌ఎంలో పాటలు ప్లే చేయడం నేరం.. మహిళల రేడియో స్టేషన్‌ను మూసివేత

రేడియో స్టేషన్ "ఇస్లామిక్ ఎమిరేట్  నియమాలు, నిబంధనలను" చాలాసార్లు ఉల్లంఘించిందని, రంజాన్ మాసంలో మహిళలు రేడియో స్టేషన్‌లో చాలాసార్లు పాటలు వాయించారని చెప్పారు. ఈ రేడియో స్టేషన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విధానాలను అనుసరిస్తూ.. ఇక నుంచి అలాంటి పని చేయదని హామీ ఇస్తే, మునుపటిలా మళ్లీ పనిచేయడానికి అనుమతిస్తామని మోజుద్దీన్ అహ్మదీ చెప్పారు.

Ramadan: ఆ దేశంలో రంజాన్‌ మాసంలో ఎఫ్‌ఎంలో పాటలు ప్లే చేయడం నేరం.. మహిళల రేడియో స్టేషన్‌ను మూసివేత
Afghanistan Taliban
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2023 | 7:48 AM

రంజాన్ పర్వదినం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవదీక్షను చేపట్టారు. అయితే తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో మాత్రం వింత రూల్స్ మళ్ళీ తెరపైకి వచ్చాయి. సంగీతం ప్లే చేసిన నేరానికి గానూ మహిళలు నిర్వహిస్తున్న రేడియో స్టేషన్‌ను తాలిబాన్ ప్రభుత్వం మూసివేసింది. ఈ సమాచారాన్ని తాలిబాన్ అధికారి వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ఈ వార్తను ప్రచురించింది. మహిళలు నిర్వహించే రేడియో స్టేషన్ పేరు సదాయి బనోవన్. అంటే ‘మహిళల స్వరం’.

ఈ మహిళా రేడియో స్టేషన్ సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 8 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 6 మంది మహిళలు ఉన్నారు. బదక్షన్ ప్రావిన్స్‌లోని సమాచార, సంస్కృతి డైరెక్టర్ మోయిజుద్దీన్ అహ్మదీ మాట్లాడుతూ.. రేడియో స్టేషన్ “ఇస్లామిక్ ఎమిరేట్  నియమాలు, నిబంధనలను” చాలాసార్లు ఉల్లంఘించిందని, రంజాన్ మాసంలో మహిళలు రేడియో స్టేషన్‌లో చాలాసార్లు పాటలు వాయించారని చెప్పారు.

ఈ రేడియో స్టేషన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విధానాలను అనుసరిస్తూ.. ఇక నుంచి అలాంటి పని చేయదని హామీ ఇస్తే, మునుపటిలా మళ్లీ పనిచేయడానికి అనుమతిస్తామని మోజుద్దీన్ అహ్మదీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

రేడియో స్టేషన్ హెడ్ నాజియా సోరోష్ ఈ విషయంపై స్పందిస్తూ.. తన రేడియోపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. అసలు రేడియో స్టేషన్ ను మూసివేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది తనపై జరిగిన కుట్రగా అభివర్ణించారు. తాను రేడియోలో మ్యూజిక్ ప్లే చేశానని తాలిబాన్లు చెప్పారని, అయితే తాను అలాంటిదేమీ చేయలేదని నాజియా సోరోష్ చెప్పారు.

రేడియో స్టేషన్ దగ్గరకు తాలిబాన్ ఫైటర్లు  వచ్చారని.. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటనే రేడియో స్టేషన్‌ను మూసివేసారని చెప్పారు. ఇంతకు ముందు కూడా తాలిబాన్లు మహిళల హక్కులను ఉల్లంఘించారని అనేక నియమ నిబంధనలు, నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. తాలిబాన్లు మహిళలు పని చేయడాన్ని నిషేధించారు. అంతేకాదు ఆరో తరగతి కంటే ఎక్కువ చదవడాన్ని కూడా నిషేధించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..