Instagram Live: ప్రియురాలితో గొడవ పడి లైవ్‌లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య.. కాపాడడం కోసం ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నం వృధా..

యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు ముంబై నుంచి బండాకు వచ్చి ఇక్కడి ఓ హోటల్‌లో ఉన్నాడు. మృతుడు తన ప్రియురాలితో సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఫోన్‌లో మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ యువకుడు మద్యం సేవించాడు. ఆత్మహత్య పాల్పడడానికి ముందు సోషల్ మీడియాలో రెండు వేర్వేరు పోస్టులు చేశాడు. అందులో ఒకదానిలో 'ఈ రోజు నేను అందరికి గుడ్ చెబుతున్నా అని పోస్ట్ చేశాడని కేసుని విచారిస్తున్న పోలీసులు చెప్పారు.   

Instagram Live: ప్రియురాలితో గొడవ పడి లైవ్‌లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య.. కాపాడడం కోసం ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నం వృధా..
Instagram Live
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2023 | 11:00 AM

ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడి లైవ్‌లో ఆత్మహత్య చేసుకోవద్దంటూ స్నేహితులు చెప్పారు.. నీ కష్టంలో మేము ఉన్నాం  అ ఆత్మహత్య చేసుకోవద్దని రిక్వెస్ట్ చేశారని.. అయితే ఆ యువకుడు ఎవరి మాట వినకుండా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు ముంబైలో ఉంటూ పెయింటింగ్ పని చేసేవాడని , కొన్ని రోజుల క్రితం ముంబై నుంచి ఇంటికి తిరిగి వచ్చాడనీ తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతర్రా తహసీల్‌లోని హోటల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి మరీ  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు పాథాలజీలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.

యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు ముంబై నుంచి బండాకు వచ్చి ఇక్కడి ఓ హోటల్‌లో ఉన్నాడు. మృతుడు తన ప్రియురాలితో సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఫోన్‌లో మాట్లాడాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ యువకుడు మద్యం సేవించాడు. ఆత్మహత్య పాల్పడడానికి ముందు సోషల్ మీడియాలో రెండు వేర్వేరు పోస్టులు చేశాడు. అందులో ఒకదానిలో ‘ఈ రోజు నేను అందరికి గుడ్ చెబుతున్నా అని పోస్ట్ చేశాడని కేసుని విచారిస్తున్న పోలీసులు చెప్పారు.

లైవ్ లో సూసైడ్ 

ఇవి కూడా చదవండి

మృతుడు ఫతేగంజ్‌లోని పీఆర్‌ ధోబిన్‌ పూర్వా గ్రామానికి చెందిన భగవాన్‌దీన్‌ కుమారుడు రాహుల్‌ శ్రీవాస్తవ (30). ముంబైలో పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. గురువారం ముంబై నుంచి అటార్రాకు చేరుకుని ఉదయం బస్టాప్ సమీపంలోని ఓ హోటల్‌లో గదితో బస చేశారు. 12 గంటల ప్రాంతంలో మొబైల్‌ని ముందు పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌కి వచ్చి బాత్‌రూమ్‌ కిటికీలోంచి తాడు బిగించి ఉరివేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇదంతా లైవ్‌లో చూసిన పానిపట్‌కు చెందిన అతుల్‌ తన స్నేహితులందరికీ ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. ఆ తర్వాత స్నేహితులంతా లైవ్‌లో చేరారు. రాహుల్ సూసైడ్ చేసుకుంటున్న సమయంలో స్నేహితులందరూ గమనిస్తూనే ఉన్నారు, అందరూ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. లైవ్‌లో..  ఎవరైనా అతన్ని ఆపండి… ఎక్కడున్నాడో కనుక్కోండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే రాహుల్ ఎవరి మాట వినలేదు.. చివరికి రాహుల్ ఉరివేసుకుని మృత్యువును కౌగిలించుకున్నాడు.

ఆత్మహత్య చేసుకునే సమయంలో స్నేహితులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, స్నేహితులు రాహుల్ బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారని.. అయితే రాహుల్ ఉన్న హోటల్ గురించి సరైన సమాచారం లేకపోవడంతో ఎవరూ రాహుల్ వద్దకు సరైన సమయంలో చేరుకోలేకపోయారు. రాహుల్ ఆత్మహత్యను ఓ స్నేహితుడు లైవ్ వీడియో చేసి ఇంటర్నెట్‌లో వైరల్ చేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే రాహుల్ ఇంత దారుణానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో ‘తల్లిదండ్రులు తనని క్షమించమని కోరాడు. తాను చాలా నిస్సహాయంగా ఉన్నానని తనకు చావు తప్ప వేరే మార్గం లేదని.. చనిపోతున్నట్లు సోదరుడికి కూడా కామెంట్ చేశాడు. ఈ అంశాలన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ: మృతుడు స్నేహితులు రాహుల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే  తమ కొడుకు  ఆత్మహత్య చేసుకున్నాడని ఫతేగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్నేహితులు పంపించిన ఇన్‌స్టాగ్రామ్ చిత్రాన్ని కూడా పోలీసులకు చూపించారు. అదే సమయంలో హోటల్ మేనేజర్ గది నుంచి యువకుడు అస్లు బయటకు రాలేదని గుర్తించాడు. బాత్‌రూమ్‌ వైపు నుంచి వెళ్లి కిటికీలోంచి చూడగా యువకుడు తాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అనంతరం ఆధార్ కార్డు ఆధారంగా ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు.

అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీనివాస్ మిశ్రా పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం  సంఘటనా స్థలానికి వచ్చి .. మద్యం బాటిల్, మొబైల్ ఫోన్, టీ షర్టు, బట్టలు, సిగరెట్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ డి హత్యా, ఆత్మహత్యా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని విచారణ తర్వాతే వెల్లడిస్తామని శ్రీనివాస్ మిశ్రా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో