Jackal Rescued: బావిలో పడిన నక్క.. పంజరం వేసి రక్షించిన రెస్క్యూ టీమ్.. నెట్టింట్లో వీడియో వైరల్
వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది రక్షకులు నక్కను.. బావిని .. తాజా పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బావిలోపల ఒక ఉచ్చు పంజరాన్ని విడిచారు. అప్పుడు నక్క పంజరం దగ్గర వరకూ ఈదుకుంటూ వెళ్ళింది.. అప్పుడు రక్షకులు దానిలోకి ప్రవేశించడానికి ప్రోత్సహించారు. నక్క బోను లోపలి ప్రవేశించిన తర్వాత బోనును పైకి లాగారు. నక్కను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి అడవిలోకి వదిలారు.
అడవిలోని జంతువులు ఒకొక్కసారి అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటాయి. ముఖ్యంగా వేసవిలో దాహార్తిని తీర్చుకోవడం కోసం బావుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్లి.. ఆ నీటిలో పడి అనుకోని ప్రమాదాల బారిన పడుతూ ఉంటాయి. తాజాగా అలా బావిలో పడిన ఓ అడవి జంతువు నక్కను అటవీశాఖ సిబ్బంది రక్షించింది. సురక్షితంగా అడవిలో తిరిగి వదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని సతారా సమీపంలోని బావిలో పడిన ఓ అడవి నక్కను రక్షించిన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. బావిలో పడిన నక్కను కొందరు స్థానికులు గమనించారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన కొందరు అటవీశాఖ అధికారులు RESQ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత నక్కను రక్షించారు.
పూణేకు చెందిన RESQ చారిటబుల్ ట్రస్ట్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో రెస్క్యూ వీడియోను షేర్ చేసింది. ”ఓ నక్క సతారా సమీపంలో బావిలో పడినట్లు సతారా FD తెలియజేసింది. అయితే బావిలో పడిన నక్క చాలా చురుకైంది. బావిలోకి ట్రాప్ పంజరం విడిచిన వెంటనే చకచకా ఆ పంజరంలోకి వచ్చింది. అయితే బావిలో ఉన్న నక్క.. సురక్షితంగా ఈ పంజరంలోకి రావడానికి తాము సున్నితంగా సూచనలు చేసినట్లు.. వాటిని అనుసరిస్తూ.. ఈ నక్క పంజరంలోకి వచ్చినట్లు వెల్లడించింది. అనంతరం ఈ నక్కను సమీపంలోని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి విడుదల చేసినట్లు వెల్లడించారు.
వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది రక్షకులు నక్కను.. బావిని .. తాజా పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బావిలోపల ఒక ఉచ్చు పంజరాన్ని విడిచారు. అప్పుడు నక్క పంజరం దగ్గర వరకూ ఈదుకుంటూ వెళ్ళింది.. అప్పుడు రక్షకులు దానిలోకి ప్రవేశించడానికి ప్రోత్సహించారు. నక్క బోను లోపలి ప్రవేశించిన తర్వాత బోనును పైకి లాగారు. నక్కను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి అడవిలోకి వదిలారు.
ఈ వీడియో 2,000 కంటే ఎక్కువ వీక్షణలను .. అనేక రీట్వీట్‌లను సొంతం చేసుకుంది. ఒక వినియోగదారు ”డే ఆఫ్ జాకల్” అని రాశారు. మరొకరు ”మంచి పని” అన్నారు.
Jackal reported fallen in well near Satara & notified by the Satara FD, Since the jackal was active, trap cage lowered into the well and jackal gently prodded to enter it. Cage pulled out and the jackal was taken to a safe space nearby and released immediately! @neha_panchamiya pic.twitter.com/qHLKsT639Q
— RESQ Charitable Trust (@resqct) April 8, 2023
ఇదే తరహా ఘటన గోవాలోని సత్తారిలో కూడా చోటు చేసుకుంది. బావిలో పడిన మగ చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది శుక్రవారం రక్షించారు. ఆహారం వెతుక్కుంటూ మానవ నివాసానికి వెళ్లిన జంతువు ఇంటి సమీపంలోని బహిరంగ బావిలో పడింది. రెస్క్యూ టీం ట్రాప్ కేజ్‌ని ఉపయోగించి జంతువును బావి నుండి బయటకు తీశారు. అనంతరం వెటర్నరీ వైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి చిరుతపులి ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..