Viral Video: పల్సర్‌ బండితో నదిని దాటిన యువకుడు .. ఈ సాహసం తెలివైన పనా? ప్రమాదకరమా?

నదిలో రెండు అడుగుల కంటే ఎక్కువ నీరు లేకపోవడంతో అతను ఎంతో చాకచక్యంగా బైక్‌ పైన నదికి ఈ వైపు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. ఏది ఏమైనా నదిలో బైక్‌ నడపడం పెద్ద సాహసమే. ఈ వీడియో నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Viral Video: పల్సర్‌ బండితో నదిని దాటిన యువకుడు .. ఈ సాహసం తెలివైన పనా? ప్రమాదకరమా?
Bike Viral Video
Follow us

|

Updated on: Apr 08, 2023 | 12:44 PM

రోడ్డు మీద కొద్దిపాటి నీళ్లున్నా, కాస్త ఇసుక ఉన్నా బైక్‌ నడపడానికి చాలా ఇబ్బంది పడతారు వాహనదారులు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా తన బైక్‌తో నదినే దాటేసాడు. పోనీ అదేమైనా నీటిలోనూ, రోడ్డుపైనా నడిచే టూ ఇన్‌ వన్ బైకా అంటే అదీ కాదు.. అది మామూలు పల్సర్‌ బైక్‌. నదిలో నీరు తక్కువగా ఉండటంతో యువకుడు ఈ సాహసం చేసినట్టు తెలుస్తోంది. నదిలో రెండు అడుగుల కంటే ఎక్కువ నీరు లేకపోవడంతో అతను ఎంతో చాకచక్యంగా బైక్‌ పైన నదికి ఈ వైపు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. ఏది ఏమైనా నదిలో బైక్‌ నడపడం పెద్ద సాహసమే. ఈ వీడియో నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఓ యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. సంకల్పం బలంగా మార్గం ఉంటుంది. ఎంతటి సాహసమైనా చేయిస్తుంది.. అయితే ఈయువకుడు చేసినది తెలివైన పనా? ప్రమాదకరమైన పనా? అంటూ ప్రశ్నిస్తూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇది నిజంగా చాలా రిస్క్‌ అని ఒకరంటే.. రిస్క్ ను అంచనా వేస్తూ తెలివిగా డ్రైవ్ చేశాడంటూ మరో యూజర్ మెచ్చుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..