AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ యూట్యూబర్‌కి కూడా ఇద్దరు భార్యలు.. వీడియోను షేర్ చేసి.. తన రెండు పెళ్లిళ్ల స్టోరీ పంచుకున్నాడు..

అర్మాన్ మాలిక్ మాదిరిగానే సన్నీ రాజ్‌పుత్ కూడా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సన్నీ రాజ్ పుత్ ఫ్యామిలీ ప్రస్తుతం చర్చలో ఉన్నారు. అర్మాన్ లాగే సన్నీకి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రతిరోజూ తన జీవనశైలికి సంబంధించిన వీడియోలను సన్నీ షేర్ చేస్తూ ఉంటాడు. అయితే సన్నీని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. 

Viral Video: ఈ యూట్యూబర్‌కి కూడా ఇద్దరు భార్యలు.. వీడియోను షేర్ చేసి.. తన రెండు పెళ్లిళ్ల స్టోరీ పంచుకున్నాడు..
Sunny Family
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 12:19 PM

Share

యూట్యూబర్ అర్మాన్ మాలిక్ .. తన ఇద్దరు భార్యలు పాయల్ మాలిక్, కృతిక మాలిక్ లతో కలిసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు వీరు ప్రతిరోజూ ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరో యూట్యూబర్ కథ ఇంటర్నెట్‌లో వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ లాగా మరో యూట్యూబర్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుతం సన్నీ రాజ్‌పుత్ గురించి మాట్లాడటం.. అతనికి సంబంధించిన వీడియో గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సన్నీ తన ఫ్యామిలీతో యూట్యూబ్‌ని నడుపుతోంది. సన్నీ 227,000 కంటే ఎక్కువ మంది  ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు అతని భార్యలు రూప, మాన్సీ ఇద్దరికీ కూడా వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. సన్నీ డిజిటల్ కంటెంట్ మేకర్.. అతను తనను తాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణించుకున్నాడు.  అయితే సన్నీని ..  అర్మాన్ కాపీ అని పిలుస్తున్నారు. అర్మాన్ లా సన్నీకి కూడా  మొదటి భార్యతో ఒక బిడ్డను కలిగి ఉన్నాడు.  తాజాగా సన్నీ ఓ వీడియోను విడుదల చేసి తన విశేషాలను నెటిజన్లతో పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

తన ప్రేమకథ గురించి సన్నీ వివరిస్తూ.. మొదట మాన్సీని కాలేజీలో కలిశానని.. అక్కడ మా ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది.. తర్వాత ఒకరినొకరం ఇష్టపడడం.. ప్రేమించుకున్నామని చెప్పారు. అయితే తమ ప్రేమ కథ కూడా సినిమా స్టోరీ మాదిరిగానే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పాడు సన్నీ.. అంతేకాదు కొన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ చూసిన రూపతో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. అయితే తన మనసులో మాన్సీపై ప్రేమ గుర్తుకొస్తునే ఉంది. అందుకే తన భార్యకు మాన్సీ గురించి అంతా చెప్పాడు.

మరో అమ్మాయిపై తన మనసులోని ప్రేమను గుర్తించి తన భార్య రూప.. భర్త సన్నీని ప్రేమించడానికి అనుమతినిచ్చింది. అయితే సన్నీ మాన్పిలు రెండో పెళ్లి చేసుకున్నా.. తాను విడాకులు ఇవ్వనని కండిషన్ పెట్టింది. సన్నీ కూడా ఏమి జరిగినా రూపకు విడాకులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో మాన్పి ని సన్నీ రెండో పెళ్లి చేసుకున్నాడు.

మాన్సీ, రూపలు ఒకరినొకరు సోదరీమణుల వలె ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ముగ్గురూ కూడా అర్మాన్ మాలిక్ లాగా జీవిస్తున్నారు. అయితే.. సన్నీ జీవనశైలి తెలిసిన నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..