Wedding Card: ‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ వివాహ ఆహ్వానపత్రిక చూసి ఖంగుతిన్న బంధువులు

జీవితంలో ఒకేఒక్కసారి జరిగే వివాహ తంతు విషయంలో ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధకనబరుస్తుంటారు. అలంకరణ, వివాహ వస్త్రాలు, పెళ్లి పత్రిక, విందు ఇలా ప్రతిదీ తమ అభిరుచికి తగ్గట్టు ప్లాన్‌ చేస్తారు. ఐతే ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో..

Wedding Card: 'దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు' వివాహ ఆహ్వానపత్రిక చూసి ఖంగుతిన్న బంధువులు
Wedding Card
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2023 | 1:23 PM

ఫోన్‌ మెసేజ్‌లు, ఈమెయిల్‌లలో ఒక్కోసారి కొన్ని పదాలు తప్పుగా టైప్‌ చేయడమో.. లేదంటే, ఫోన్‌ డీఫాల్ట్‌గా మనం టైప్‌ చేసే పదాలను మార్చేయటమో జరుగుతుంది. వాటిని సరిచేసుకోకుండా అలాగే మెసేజ్‌ చేస్తే.. మొత్తం అర్థం పూర్తిగా మారిపోతుంది. దీంతో అవతలివాళ్లు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. అలాంటిది ఏకంగా పెళ్లి ఆహ్వన పత్రికలో ఇలాంటి ప్రింటింగ్‌ మిస్టేక్‌లు జరిగితే..! మొత్తం బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అపార్థం చేసుకోవడం, నవ్వుల పాలవ్వడం ఖాయం. అలాంటి చిన్న పొరబాటు వల్ల.. అందరూ పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి అని రాయడానికి బదులు ‘పెళ్లికి మీరెవ్వరూ రావద్దని’ వివాహ ఆహ్వానపత్రికపై ప్రింట్‌ చేశారు. ఇంకేముంది బంధుగణమంతా తికమకపడిపోయారు. ఈ వింత పెళ్లి పత్రిక కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సర్వత్రా జోకులు పేలుతున్నాయి.

నిజానికి జీవితంలో ఒకేఒక్కసారి జరిగే వివాహ తంతు విషయంలో ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధకనబరుస్తుంటారు. అలంకరణ, వివాహ వస్త్రాలు, పెళ్లి పత్రిక, విందు ఇలా ప్రతిదీ తమ అభిరుచికి తగ్గట్టు ప్లాన్‌ చేస్తారు. ఐతే ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో ప్రింటింగ్ టైంలో చిన్న మిస్టేక్ జరిగింది. దీంతో అతిథులంతా తెగ కంగారు పడిపోయారు. పెళ్లి కార్డును ఎంతో కవితాత్మకంగా హిందీ భాషలో పెళ్లిపెద్దలు రాశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా చివరిలో మాత్రం ‘ హే మనస్ కే రాజన్స్ తుమ్ భూల్ జానా ఆనే కో (ఈ ఆహ్వానాన్ని ప్రేమతో పంపుతున్నాను. దయచేసి పెళ్లికి రావడం మర్చిపోండి)’ అని ప్రింటయ్యింది. ప్రింటింగ్‌కి ఇచ్చేముందు జరిగిన తప్పిదమో.. లేదా ప్రింటింగ్ స్టూడియోలో జరిగిన తప్పిదమో తెలియదుగానీ.. మొత్తానికి ప్రింట్‌ తర్వాత పెళ్లింటి వారు కార్డులను చెక్‌ చేసుకోకుండానే అందరికీ పంపించారు. ఇక ఇన్విటేషన్ అందుకున్న అతిథులు కార్డ్ చూసి తెల్లమొహాలు వేశారు. వివాహానికి ఆహ్వానిస్తున్నారా? లేదా రావొద్దని చెబుతున్నారో? తెలియక సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ కార్డ్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.