AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మరో మూగజీవి పిల్లి కోసం.. వానరం చేసిన సాహసం.. మనుషుల్లో కనిపించని చేయూత ఇది..

ఈ వీడియో ట్విటర్ వేదికగా అందరినీ ఆకట్టుకుంది. కోతి చూపించిన దయకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరికొందరు వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాటిని కాపాడకుండా ఇలా వీడియో తీయటం ఎంటనీ ప్రశ్నించారు. ఇలా

Watch: మరో మూగజీవి పిల్లి కోసం.. వానరం చేసిన సాహసం.. మనుషుల్లో కనిపించని చేయూత ఇది..
Monkey Video
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2023 | 12:43 PM

Share

Viral Monkey Videos: స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్ పుణ్యమాని ఈరోజుల్లో వైరల్ వీడియోలకు కొదువ లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరిగినా సరే… స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి క్షణాల్లో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో మంచి, చెడు రెండూ ఉంటున్నాయి. చెడు సంగతి పక్కనపెడితే… కొన్ని వైరల్ వీడియోలు మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ఆ వీడియోలు చూసి హాయిగా నవ్వుకోవచ్చు అనుకుంటున్నారు ప్రజలు. ఫన్నీ వీడియోలను ఎంజాయ్‌ చేస్తూ..ఒత్తిడి నుంచి రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారు. అలాంటి ఫన్నీ వీడియోలతో పాటు జంతువుల్లోనూ ఉండే జాలి, దయ, మానవత్వానికి సంబంధించిన సంఘటనలు చూపించే వీడియోలు కూడా అనేక సందర్భా్ల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఒక కోతి మరో మూగజీవి పిల్లి ఆపదలో ఉండగా కాపాడుకునేందుకు ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక పిల్లి పాడుబడిన బురద బావిలో పడి కూరుకుపోతుంది. అది గమనించిన కోతి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే ఆ బావిలోకి దూకేసింది. బురదలో మునిగిపోయిన పిల్లిని కోతి తన రెండు చేతులతో పైకి ఎత్తుకుంది. ఆ పిల్లిని కాపాడానికి ఆ వానరం తీవ్రంగా శ్రమించింది. కానీ, పాపం దాని ప్రయత్నం ఫలించలేదు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కోతి తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, పిల్లిని బావి నుంచి బయటకు తీసుకెళ్లేంత శక్తి దానికి లేదు. దాంతో ఆ వానరం మరొక కోతిని సహాయం చేయమని కోరినట్టుగా కనిపించింది. కానీ అది కూడా భయపడి అక్కడ్నుంచి నుండి పారిపోయినట్లు అనిపించింది. అంతలోనే ఓ చిన్నారి ఆ మూగజీవాల పట్ల రక్షకురాలిగా వచ్చింది. ఆమె బురద బావిలోకి దిగి, పిల్లి పిల్లను బయటకు లాగడంతో కోతి ఆందోళన తీరింది. ఆ అమ్మాయి బురద బావిలోంచి పిల్లి పిల్లను బయటకు తీయగానే, కోతి వెంటనే ఆ పిల్లిని తన చేతుల్లోకి లాక్కుని దగ్గరకు తీసుకుంది. తరువాత అక్కడున్న పెద్దవారు పిల్లికి అంటిన మురికిని, మట్టిని వదిలించుకోవడానికి పిల్లి పిల్లను టవల్‌తో తుడవడం కనిపించింది. అయితే కోతి వణుకుతున్న పిల్లిని ఆప్యాయంగా లాలించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఈ వీడియో ట్విటర్ వేదికగా అందరినీ ఆకట్టుకుంది. కోతి చూపించిన దయకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరికొందరు వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాటిని కాపాడకుండా ఇలా వీడియో తీయటం ఎంటనీ ప్రశ్నించారు. ఇలా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.