వేసవిలో దోమలబెడదతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న దీపం మీ సమస్యను పరిష్కరిస్తుంది.. !
విద్యుత్తుతో పనిచేసే రెండు యూనిట్లతో తయారు చేసిన ఈ పరికరంతో దోమలు వాటంతట అవే ఎగురుకుంటూ వచ్చి పడతాయి. అంతేకాదు, అలా వచ్చిన దోమలు పూర్తిగా చచ్చిపోవాల్సిందే. ఈ పరికరం ప్రధాన లక్షణం ఏమిటంటే ఇది క్షణాల్లో వందల కొద్దీ దోమలను ఆకర్షించి చంపగలదు.
Mosquito Killer Lamp: ఇతర సీజన్ల కంటే వేసవిలో దోమల బెడద కాస్త ఎక్కువ. కొంతమంది దీనిని వదిలించుకోవడానికి దోమ తెరలను ఉపయోగిస్తారు. మరికొందరు దోమలకోసం లిక్విడ్, కాయిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే అలర్జీల కారణంగా కొందరు వీటిని వాడకుండా ఉంటారు. ఈ సాంకేతిక యుగంలో పర్యావరణ అనుకూలమైన దోమల కిల్లర్ పరికరాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది దోమల నుండి విముక్తి పొందడమే కాకుండా మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. ఆ పరికరమే మస్కిటో కిల్లర్ ల్యాంప్. మస్కిటో కిల్లర్ ల్యాంప్ అనేది చాలా తక్కువ ధరలో లభించే పరికరం. దీన్ని Amazonలో కేవలం రూ.689కే కొనుగోలు చేయవచ్చు. దీని పేరు (Bug Zapper Mosquito and Fly Killer Indoor Light with Electric Killing Lamp Portable USB LED Trap). ఇంకా మరికొన్ని కేవలం 300 లోపు ధర నుంచే లభిస్తున్నాయి.
ఈ మస్కిటో కిల్లర్ ల్యాంప్ ఎలా పని చేస్తుంది..?
ఈ ఎకో ఫ్రెండ్లీ మస్కిటో కిల్లర్ ల్యాంప్ రెండు భాగాలతో రూపొందించబడింది. ఒక యూనిట్ లైన్‌గా పనిచేస్తే, మరొక యూనిట్ చూషణగా పనిచేస్తుంది. విద్యుత్తుతో పనిచేసే రెండు యూనిట్లతో తయారు చేసిన ఈ పరికరంతో దోమలు వాటంతట అవే ఎగురుకుంటూ వచ్చి పడతాయి. అంతేకాదు, అలా వచ్చిన దోమలు పూర్తిగా చచ్చిపోవాల్సిందే. ఈ పరికరం ప్రధాన లక్షణం ఏమిటంటే ఇది క్షణాల్లో వందల కొద్దీ దోమలను ఆకర్షించి చంపగలదు.
ఈ మస్కిటో కిల్లర్ పరికరాన్ని ఇంట్లో, ఆఫీసులో, ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ఎకో ఫ్రెండ్లీ మస్కిటో కిల్లర్ ల్యాంప్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..