AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. వారందరికీ ప్రొబేషన్‌ ఖరారు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్‌ ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 17) ఉత్తర్వులు జారీ..

Andhra Pradesh: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. వారందరికీ ప్రొబేషన్‌ ఖరారు
Andhra Pradesh
Srilakshmi C
|

Updated on: Apr 18, 2023 | 10:14 AM

Share

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్‌ ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 17) ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరంతా ప్రస్తుతం నెలకు రూ.15 వేల వేతనం అందుకుంటున్నారు. ప్రొబేషన్‌ ఖరారైన గ్రేడ్‌ 5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు ప్రస్తుతం అందుకుంటున్న వేతంనం రూ.23,120 కాగా.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత వారి వేతనం రూ. 29,598కు పెరగనుంది. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం రూ.22,460 అందుకుంటుండగా.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753లకు వేతనం పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్‌­ఆర్‌ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే జూన్‌ ఒకటిన ఉద్యోగులకు పెరిగిన జీతం అందుతుంది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిల్లో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. దీని ద్వారా జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్‌ జారీచేశారు. పంచాయతీరాజ్‌శాఖలో 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా, వారిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్‌ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. మొదటి విడతలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు 2020లో రెండోసారి నోటిఫికేసన్‌ జారీ చేయగా 12,837 మంది ఉద్యోగాలు పొందారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్‌ పొందుతారు. తాజాగా ప్రొబేషన్‌ ఖరారు చేయడంతో వీరందరికీ జీతం రెట్టింపుకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.