Andhra Pradesh: దోమలు కుడుతున్నాయని మస్కిటో కాయిల్ వెలిగించి నిద్రపోయాడు.. తెల్లారేసరికి..
దోమలు ఎక్కువగా ఉండటంతో.. బెడద తాళలేకపోయాడు. అనంతరం, దోమల కాయిల్ వెలిగించి హాయిగా నిద్రపోయాడు. అదే.. అతనికి శాపమైంది. మస్కిటో కాయిల్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి.. సజీవదహనమయ్యాడు.
దోమలు ఎక్కువగా ఉండటంతో.. బెడద తాళలేకపోయాడు. అనంతరం, దోమల కాయిల్ వెలిగించి హాయిగా నిద్రపోయాడు. అదే.. అతనికి శాపమైంది. మస్కిటో కాయిల్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి.. సజీవదహనమయ్యాడు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మార్లపల్లిలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మార్లపల్లిలో మస్కిటో కాయిల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి.. నిరంజన్ (46) అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. మార్లపల్లికి చెందిన నిరంజన్ దోమలు ఎక్కువగా ఉన్నాయని, సోమవారం రాత్రి కాయిల్ వెలిగించి నిద్రపోయాడు.
ఈ క్రమంలో మస్కిటో కాయిల్ ద్వారా.. అకస్మాత్తుగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించి ఇంటి మొత్తానికి మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న నిరంజన్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు.
ఉదయాన్నే ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలు, పొగలను అదుపుచేసి.. లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే నిరసంజన్ డెడ్ బాడీ సగం కాలిపోయి కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
నిరంజన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..