Corona in AP: కోనసీమ జిల్లాలో కరోనా కలకలం.. 47మందికి పాజిటివ్‌, ఇద్దరు మృతి.. అప్రమత్తమైన వైద్య శాఖ

దేశ రాజధాని ఢిల్లీ సహా కేరళ, మహారాష్ట్ర, లతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో కోవిడ్ కలవరం సృష్టిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది

Corona in AP: కోనసీమ జిల్లాలో కరోనా కలకలం.. 47మందికి పాజిటివ్‌, ఇద్దరు మృతి.. అప్రమత్తమైన వైద్య శాఖ
Corona In Ap
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2023 | 12:26 PM

దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా కేరళ, మహారాష్ట్ర, లతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి..అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 47మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది.. పి.గన్నవరం సీహెచ్‌సీలో ఐదుగురికి కరోనా సోకింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదే విషయంపై జిల్లా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణమే రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు కారణం అని చెప్పారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా డి.గన్నవరం CHC లో ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ కేసులు నమోదయ్యాయని.. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిర్ధారణ అయినా బాధితులు హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా అందరూ కోలుకుంటున్నారని. పరిస్థితులు ఆందోళన కరంగా లేవని.. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు దుర్గారావు.

.మరోవైపు కాకినాడలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి..ఇప్పటివరకూ కేసులే అనుకుంటే ఇప్పుడు మరణాలు సంభవించడం ఆందోళన కారణమైంది.. కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు..న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరారు పేషెంట్లు..ఆ ఇద్దరికి కరోనా సోకడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే