Drumstick: వీఐపీ పెళ్లిళ్లలో వెరీ స్పెషల్ డిష్ ఇక్కడి ములక్కాడ కూర .. చెట్లకు పూత రాకముందే ప్రీ బుకింగ్స్..

సాధారణ ములక్కాడ పొడుగ్గా ఉంటే ఇక్కడ పండే ములక్కాడ కాస్త పొట్టిగా పిక్క తక్కువా గుజ్జు ఎక్కువగా ఉంటుంది. దీనితో ఈ ములకాడలు ఏ కూరలో వేసినా మసాలా బాగా పట్టుకుని చాలా అద్భుతంగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇక్కడ వుండే గ్రామస్తులు ములగ చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.

Drumstick: వీఐపీ పెళ్లిళ్లలో వెరీ స్పెషల్ డిష్ ఇక్కడి ములక్కాడ కూర .. చెట్లకు పూత రాకముందే ప్రీ బుకింగ్స్..
Drum Stick In Krishna Distr
Follow us

|

Updated on: Apr 08, 2023 | 4:36 PM

ఆ ఊర్లో ఉన్న గడపలు 700 అక్కడ పెరటిలో ఉన్న చెట్లు 1000.. ప్రతి చెట్టు కాపు కాయకుండానే అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుంటాయి. రైతు బజార్ లో వీటికి యమగిరాకి. వీ.ఐ.పి.ల విందు కార్యక్రమాలలో తప్పకుండా వుంటుంది అది..ఎంటి? మేటర్ చెప్పకుండా ఈ ఉపోద్ఘాతం అని అనుకుంటున్నారా ! కాయకూరలలో పొడుగ్గా వుండే ములకాడ గురించి ఇప్పటి వరకు చెప్పింది. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ వూరు? ఆ ములకాడకు ఎందుకు అంత క్రేజ్.

ఈ జన్మమే రుచి చూడడానికి పుట్టెరా.. అనే పాట లో పదాలు అక్షర సత్యాలు. పసందైన రుచులు కోసం భోజన ప్రియులు ఎంత దూరం అయినా వెళ్తారు. ఎన్టీఆర్ జిల్లా పాతపాడు మండలం లో ఉన్న మంగళాపురం గ్రామం లో ములకాడల రుచి అమోఘం. అందుకే అక్కడ పండే ములక్కడలకు అంత క్రేజ్.. ఆ ఊర్లో ప్రతి పెరట్లో కచ్చితంగా ములక్కాడ చెట్టు వుంటుంది. ఆ ఊరు మీదగా ఎవరు వెళ్ళినా ములక్కాడలు ఉన్నాయా అని అడగక మానరు..

సాధారణ ములక్కాడ పొడుగ్గా ఉంటే ఇక్కడ పండే ములక్కాడ కాస్త పొట్టిగా పిక్క తక్కువా గుజ్జు ఎక్కువగా ఉంటుంది. దీనితో ఈ ములకాడలు ఏ కూరలో వేసినా మసాలా బాగా పట్టుకుని చాలా అద్భుతంగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇక్కడ వుండే గ్రామస్తులు ములగ చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటి కాయలే కాదు ములగాకు కు కూడా భారీగా డిమాండ్ ఉంది. కరోనా తరువాత ములగాకు కోసం చాలా మంది ఇక్కడికి వస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్నో కుటుంబాలు ఈ ములగ చెట్లపై ఆధారపడి కాయలు అమ్మకం పై కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా ములకాడలు వెళ్తుంటాయి అంటే వీటి ప్రత్యేకత ఎంటో అంచనా వెయ్యవచ్చు. సీజన్ లో రైతు బజార్ లో ఒక్కో ములకాడ 8 నుండి 10 రూపాయలు కూడా అమ్ముతుంటారు..లేత ములకాడలు మార్వాడీలు ఎక్కువుగా కొంటారని వీటి కోసం అడ్వాన్స్ గా డబ్బు కూడా ఇస్తుంటారనీ రైతులు చెప్తున్నారు.

Reporter : Vikram, TV9 Telugu, Vijayawada

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..