Andhra Pradesh: ఇంటి పెరట్లో ఏపుగా పెరిగిన మొక్కలు.. పొరుగింటి వారి సమాచారంతో పోలీసుల ఎంట్రీ..

ఇప్పుడిపుడే పట్టణాల్లో కూడా డాబాలమీద కూడా మొక్కల పెంపకం మొదలు పెట్టారు. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం తాను అందరికంటే భిన్నం అనుకున్నాడేమో.. తన ఇంటి ఆవరణలో ఏకంగా గంజాయి చెట్లను పెంచడం  మొదలు పెట్టాడు.

Andhra Pradesh: ఇంటి పెరట్లో ఏపుగా పెరిగిన మొక్కలు.. పొరుగింటి వారి సమాచారంతో పోలీసుల ఎంట్రీ..
Ganjayi
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 06, 2023 | 3:52 PM

పల్లెల్లో ప్రతి ఇంటిలో చిన్న ఖాళీ స్థలం ఉన్నా.. అందులో కొబ్బరి, మామిడి వంటి చెట్లతో పాటు.. పువ్వులు, అందం కోసం క్రోటన్స్ , కూరగాయ మొక్కలు పెంచుకుంటారు. తమ ఇంటి పిల్లల్లా ఆ మొక్కలను భావిస్తారు. అయితే ఇప్పుడిపుడే పట్టణాల్లో కూడా డాబాలమీద కూడా మొక్కల పెంపకం మొదలు పెట్టారు. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం తాను అందరికంటే భిన్నం అనుకున్నాడేమో.. తన ఇంటి ఆవరణలో ఏకంగా గంజాయి చెట్లను పెంచడం  మొదలు పెట్టాడు. ఆ విషయం పోలీసుల  దృష్టికి చేరుకోడవంతో కటకటాలను లెక్కపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఉమ్మడి ప్రకాశంజిల్లా మార్టూరు లోని ఆదిజాంబవంత కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో ఓ ఇంటి యజమాని నాలుగు గంజాయి చెట్లను పెంచుతున్నాడు. అవి ఏపుగా పెరిగి పదిమంది దృష్టిలో పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోని దిగిన పర్చూరు సెబ్ అధికారులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేశారు. ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను పర్చూరు సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నాలుగు చెట్లు ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్నాయని చెప్పారు. 17 కిలోలు గంజాయి ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు చెప్పారు. గంజాయిని పెంచుతున్న ఇంటి యజమాని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక వ్యక్తిని గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..