Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: జోరుగా ఎడ్లబండ్ల పోటీలు..పోటెత్తిన జనం.. ప్రైజ్ మనీ ఎంతంటే.?

ఎడ్లపోటీల్లో గెలుపొందినవారికి నగదు, షీల్డ్‌ను బహుమతిగా అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే ఆలయ కమిటి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఎడ్లబండ్ల పోటీలను తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు.

Kakinada: జోరుగా ఎడ్లబండ్ల పోటీలు..పోటెత్తిన జనం.. ప్రైజ్ మనీ ఎంతంటే.?
Eddula Potilu
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 06, 2023 | 1:33 PM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఎడ్లబండ్ల పోటీలు జోరుగా నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలలనుంచి పోటీదారులు తమ తమ ఎడ్లతో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తారు. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీసీతారామ కళ్యాణం అనంతరం దేలాలయ కమిటీ ఈ పోటీలను నిర్వహిస్తుంది. ఎడ్లపోటీల్లో గెలుపొందినవారికి నగదు, షీల్డ్‌ను బహుమతిగా అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే ఆలయ కమిటి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు.

ఎడ్లబండ్ల పోటీలను తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ పోటీలను జూనియర్‌, సీనియర్‌ అనే రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. సీనియర్స్‌ విభాగంల ఓసామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్రకుమార్‌ ఎడ్లు మొదటి బహుమతిని గెలుచుకోగా, అనకాపల్లి జిల్లా చుక్కపల్లి గ్రామానికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్ల జతకు ద్వితీయ బహుమతి లభించింది. ఇటు జూనియర్స్‌ విభాగంలో కొవ్వాడకు చెందిన మట్టా నవనీత్ శ్రీ మణికంఠ ఎడ్ల జతకు ప్రథమ స్థానం, వెల్దుర్తి గ్రామానికి చెందిన మొగలి ఏసు బాబు ఎడ్ల జతకు ద్వితీయ బహుమతి లభించాయి. పెద్దాపురానికి చెందిన గాదాపు ప్రేరణ ఎడ్ల జతకు తృతీయ బహుమతి లభించింది. విజేతలకు స్ధానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..