AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ వాహనాలకు కొత్త సిరీస్‌తో రిజిస్ట్రేషన్ నెంబర్లు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న..

Andhra Pradesh: ఆ వాహనాలకు కొత్త సిరీస్‌తో రిజిస్ట్రేషన్ నెంబర్లు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం
Ap Government
Ravi Kiran
|

Updated on: Apr 06, 2023 | 1:16 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్‌ల స్ధానంలో ఇకపై కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నెంబర్లతో కొనసాగుతాయంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఏపీ 40జీ సిరీస్‌తో నంబర్లను కేటాయించనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలకు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్‌లతో రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్‌లతో కొనసాగుతున్నాయి. వీటి స్ధానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నెంబర్ కేటాయిస్తారు. ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే ప్రభుత్వ వాహనాలకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు జగన్ సర్కార్ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా వచ్చే అభ్యంతరాలను పరిశీలించి నోటిఫికేషన్‌లో తగిన మార్పులు చేసి అమలు చేస్తామని పేర్కొంది.

కాగా, తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో వన్ స్టేట్-వన్ సిరీస్‌ను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో అప్పటివరకూ జిల్లాల వారీగా ఉన్న పలు సిరీస్‌లు రద్దయ్యాయి. వాటి స్ధానంలో కొత్తగా ఏపీ 39 సిరీస్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు శ్రీకాకుళంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, తిరుపతిలో చేసుకున్నా అదే సిరీస్ వర్తిస్తోంది. ప్రభుత్వ వాహనాలకు సైతం ఇదే సిరీస్ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వాహనాలు ప్రత్యేకంగా కనిపించాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు.

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!