DCCB Vizianagaram Jobs 2023: విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ).. 32 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ).. 32 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష, ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. విజయనగరం జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.590లు, ఎస్సీ/ఎస్టీ/పీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.413లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మే/ జూన్ 2023లో ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,900ల నుంచి రూ.47,920ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో 100 మార్కులకుగానూ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.