Government Jobs 2023 : 1.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పది పాసైతే చాలు..
కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగలను ప్రకటించింది. మొత్తం లక్ష30 వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. రక్షణ దళంలో పని చేయాలని ఉత్సాహం ఉన్న అభ్యర్థులు ఇందులో పోటీ పడొచ్చు. CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
CRPF Recruitment 2023: CRPFలో బంపర్ రిక్రూట్‌మెంట్‌లు రాబోతున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే, దరఖాస్తు ప్రారంభ.. ముగింపు తేదీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లోని ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం, మొత్తం 1,29,929 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,25,262 పోస్టులు పురుష అభ్యర్థులకు కాగా, 4,467 పోస్టులు మహిళా అభ్యర్థులకు ఉన్నాయి. దీనితో పాటు, మాజీ అగ్నివీర్ కోసం పది శాతం ఖాళీలు రిజర్వ్ చేయబడ్డాయి. కానిస్టేబుల్ పోస్ట్‌లో మాజీ అగ్నివీర్‌ను నియమిస్తారు.
10వ తరగతి పాస్ వర్తిస్తాయి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వారి వయోపరిమితి ఏంటంటే.. 18 నుంచి 23 సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరణాత్మక ప్రకటన ప్రచురణ తర్వాత వివరంగా సమాచారాన్ని చూడవచ్చు.
ఎంపిక ఎలా ఉంటుందంటే..
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. తదుపరి దశల కోసం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి.. అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అవసరం. ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే వారు తదుపరి దశ పరీక్షకు హాజరు కాగలరు.
Ministry of Home Affairs has issued a notification regarding recruitment for around 1.30 lakh posts of constables in CRPF pic.twitter.com/XgyaOzj9GL
— ANI (@ANI) April 6, 2023
ఎంత జీతం వస్తుందంటే..
ఈ పోస్టులకు ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో వారు పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం పొందుతారు. దరఖాస్తు ప్రారంభ తేదీల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వివరణాత్మక నోటీసును త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఏదైనా విషయంపై మరింత వివరంగా తాజా అప్‌డేట్స్‌ను పొందడానికి CRPF అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ చూడండి..