Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డెమోన్‌స్ట్రేటర్లను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల కాలవ్యవధికి..

AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Aiims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 06, 2023 | 7:20 PM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డెమోన్‌స్ట్రేటర్లను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల కాలవ్యవధికి ఈ పోస్టులను తీసుకోన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా వీటిన భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఇంటర్వ్యూను ఏ తేదీల్లో నిర్వహించనున్నారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీ, ఎండీఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 1000 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతంగా రూ. 67,700 చెల్లిస్తారు.

* ఇంటర్వ్యూలను ఏప్రిల్‌ 14, 2023 తేదీన అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..