Andhra Pradesh: మాకు ఈ హెడ్ మాస్టర్ వద్దే వద్దు.. రోడ్డెక్కిన విద్యార్థులు.. కారణం ఏంటంటే..?
శ్రీకాకులం జిల్లా జి.సిగడాం మండలం డి.ఆర్ వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులను ప్రధానోపధ్యాయుడు బలరాం లైంగికంగా వేధిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు.
శ్రీకాకులం జిల్లా జి.సిగడాం మండలం డి.ఆర్ వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు బలరాం లైంగికంగా వేధిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. రెండు రోజుల కిందే హెచ్ఎం వ్యవహారం బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆయన్ని నిలదీశారు. పాఠాలు చెప్పి, విద్యార్థుల భవిష్యత్తును మార్చాల్సిన వారే ఇలా లైంగికంగా వేధించడమేంటని మండిపడ్డారు. చివరికి పోలీసులకు, పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులతో పాటు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. ఈ హెచ్ ఎం మాకొద్దని..పాఠశాలకు వస్తే లోపలికి అడుగుపెట్టనీయమని విద్యార్థులు నినాదాలు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న హెచ్ ఎం బలరాం పాఠశాలకు శనివారం సెలవు పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..