AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఓరి భగవంతుడా..! ఎలుకతో వాకింగ్.. అది కూడా మిట్టమధ్యాహ్నం.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?

వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు.. జీర్ణవ్యవస్థకు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కారణాల వల్లనే వాకింగ్ వెళ్లే కొందరు తమతో పాటు వారి పెంపుడు కుక్కలను కూడా తీసుకెళుతుంటారు. అయితే మీలో ఎవరైనా ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని కొట్టేయకండి..

Funny Video: ఓరి భగవంతుడా..! ఎలుకతో వాకింగ్.. అది కూడా మిట్టమధ్యాహ్నం.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
Rat Going For Morning Walk
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 08, 2023 | 7:50 AM

Share

మనలో చాలా మందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు.. జీర్ణవ్యవస్థకు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కారణాల వల్లనే వాకింగ్ వెళ్లే కొందరు తమతో పాటు వారి పెంపుడు కుక్కలను కూడా తీసుకెళుతుంటారు. అయితే మీలో ఎవరైనా ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అని కొట్టేయకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు కూడా ఇదే సందేహం కలుగుతుంది. అవును, ఓ వ్యక్తి తన ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లాడు. అంతేనా, దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట కూడా షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియలో ఒక వ్యక్తి తనతో పాటు ఒక ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్తాడు. రోడ్డు పక్కన వెళ్తున్న అతని వీడియలో కనిపిస్తున్న నీడను బట్టి అది మధ్యాహ్నం అని అర్థం చేసుకోవచ్చు. ఇక తన పెంపుడు ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లిన అతను.. అచ్చం పెంపుడు కుక్కలకు కట్టినట్లుగానే మెడలో తాడు కట్టి నడిపిస్తున్నారు. దీనికి  సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

వాకింగ్‌కి వెళ్తున్న ఎలుక వీడియోను ఇక్కడ చూడండి..

ఈ క్రమంలోనే చాలా ఫన్నీ వీడియో అని, ఐడియా అద్భుతమని, చాలా నచ్చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘నేను కూడా ఒక బల్లిని పెంచుకోవాలని కోరుకుంటున్నాన’ని కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 11 లక్షల 92వేల లైకులు, అలాగే 2 కోట్ల 87 లక్షల మంది వీక్షించారు. ఇంకా ఈ వీడియోపై దాదాపు 11 వేలకు పైగా  కామెంట్లు కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..