Dog vs Duck: వేటకు దిగిన కుక్కను ఆట ఆడేసుకున్న బాతు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో.. మీరూ చూసేయండి..

మనుషులకు ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలు చాలా చురుకైనవి, తెలివైనవి కూడా. అయితే అలాంటి చురుకైన కుక్కను ఒక ఆట ఆడుకుంది ఓ బాతు. అవును, ఆ కుక్కను బాతు ముప్పుతిప్పలు పెట్టింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియలో ఒక కుక్క..

Dog vs Duck: వేటకు దిగిన కుక్కను ఆట ఆడేసుకున్న బాతు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో.. మీరూ చూసేయండి..
Dog vs Duck
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 08, 2023 | 6:45 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో పెంపుడు కుక్కలకు సంబంధించినవి కూడా ప్రధానంగా ఉంటాయి. మనుషులకు ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలు చాలా చురుకైనవి, తెలివైనవి కూడా. అయితే అలాంటి చురుకైన కుక్కను ఒక ఆట ఆడుకుంది ఓ బాతు. అవును, ఆ కుక్కను బాతు ముప్పుతిప్పలు పెట్టింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియలో ఒక కుక్క.. వీధి పక్కన ఉన్న చిన్న కాలువలో ఆడుకుంటున్న బాతుపై కన్నేసింది. అంతేనా.. చూసేందే ఆలస్యం దానిని పట్టుకోవాలని దాని మీదకు ఒక్క దూకు దూకింది.

అయితే బతికే రోజులు ఇంకా ఉన్నందుకు ఆ బాతు ఒక్క సారిగా తాను ఉన్న చాటు నుంచి మాయమై నీటి లోపలికి వెళ్లింది. బాతు ఏమయ్యిందో తెలియని ఆ కుక్క దాని కోసం వెతుకుంతుంటుంది. అలా వెనక్కి చూడగానే అక్కడ బాతు ఉండడాన్ని గమనిస్తుంది. అంతే.. మళ్లి అక్కడకు వెళ్లి బాతును పట్టుకోవాలని చూస్తుంది ఆ కుక్క. కానీ బాతు మరోసారి నీట మునక వేసి తప్పించుకుంటుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లకు తెగ నచ్చేసింది. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కెమెంట్లు చేస్తూ.. సరదాగా నవ్వుకోవాలని తమ సన్నిహితులకు కూడా షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాతును వెంటాడుతున్న కుక్కకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..