IPL 2023, LSG vs SRH: మళ్ళీ ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. 4 ఓవర్లు ఉండగానే లక్నో సొంతమైన విజయం..

హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 16లో తన రెండో మ్యాచ్‌ని కూడా ఓడినట్లయింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆరెంజ్ ఆర్మీ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అలాగే లక్నో కూడా ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించిన లక్నో ఇప్పుడు హైదరాబాద్‌పై గెలిచి

IPL 2023, LSG vs SRH: మళ్ళీ ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. 4 ఓవర్లు ఉండగానే లక్నో సొంతమైన విజయం..
Lucknow Ipl
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 08, 2023 | 3:24 AM

లక్కో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమ్ 5 వికెట్ల తేడాతో సునాయసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని లక్నో టీమ్ 4 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ  క్రమంలో లక్కో తరఫున కెప్టెన్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో రాణించారు. దీంతో లక్నో విజయం ఖరారైంది. దీంతో హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 16లో తన రెండో మ్యాచ్‌ని కూడా ఓడినట్లయింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆరెంజ్ ఆర్మీ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అలాగే లక్నో కూడా ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించిన లక్నో ఇప్పుడు హైదరాబాద్‌పై గెలిచి రెండో సారి విజయ పతాకాన్ని ఎగరవేసింది.  అయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి 41 బంతుల్లో 35, అన్మోల్‌ప్రీత్ సింగ్ 26 బంతుల్లో 31 పరుగులు చేశారు. కృనాల్ పాండ్యా లక్నో తరపున మూడు వికెట్లను దక్కించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన లక్నోకి శుభారంభం లభించకపోయినా.. బ్యాటర్లు నిలకడగా రాణించారు. ఓపెనర్‌గా వచ్చిన కేల్ మేయర్స్ 5వ ఓవర్లోనే మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాట పట్టాడు. అయితే అతనితో పాటు వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం కెప్టెన్ బాధ్యతలను సరిగ్గా నిర్వహించాడు. 16 ఓవర్లు సాగిన లక్నో ఇన్నింగ్స్‌లో అతను 14.1 ఓవర్ వరకు క్రీజులోనే ఉండి 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 4 ఫోర్లు కూడా బాదాడు. తొలి వికెట్ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా విఫలమైనా ఆపై వచ్చిన కృనాల్ 34 పరుగులతో జట్టు విజయం కోసం తన వంతు పాత్ర పోషించి ఔటయ్యాడు. చివర్లో వచ్చిన నికోలస్ పూరన్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా లక్నో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఇక హైదరాబాద్ తరఫున అదిల్ రషిద్ 2 వికెట్లు తీసుకోగా భువనేశ్వర్, ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..